బిజినెస్

ఐటి రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 29: మహిళాభ్యున్నతికి వివిధ చర్యలు తీసుకుంటున్న ఎపి ప్రభుత్వం, ఐటి రంగంలో పెద్ద ఎత్తున మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. వివిధ రాయితీలు, చట్టాల నుంచి మినహాయింపుల ద్వారా మహిళలను ఐటి రంగం వైపు ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ రకాల రాయితీల ద్వారా వారికి ఐటి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐటి పార్క్‌ల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రొత్సహిస్తోంది. ఇప్పటికే మహిళాభ్యున్నతికి అనేక చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఐటి రంగంలో కూడా వారి వెన్నంటే నిలుస్తోంది. ఐటి పాలసీ 2014-2020లో భాగంగా మహిళలకు సంబంధించి వివిధ రాయితీలను కచ్చితంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, ఎపి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ తదితర చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు భద్రత, మూడు షిఫ్ట్‌ల్లో పని చేయించుకోవడానికి అవకాశమిచ్చారు. ఐటి పరిశ్రమకు కేటాయించే భవనాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. బిల్డప్ స్పేస్‌లో 15 శాతం రిజర్వు చేయగా, స్థిర మూల ధనంలో 20 శాతం సబ్సిడీ ఇస్తారు. పెట్టుబడులకు సంబంధించి వర్కింగ్ క్యాపిటల్, కాలపరిమితి రుణాలపై వడ్డీలో ఐదు శాతం సబ్సిడీ ఇస్తారు. ఇలా ఏడాదికి 50 లక్షలకు మించకుండా ఐదేళ్లపాటు అందిస్తారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో కూడా 20 లక్షల రూపాయలకు మించకుండా 20 శాతం పెట్టుబడిని సబ్సిడీగా ఇస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో ఐదు శాతం ఇస్తున్నారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఇ) కింద స్థాపించే ఐటి యూనిట్స్‌కు విద్యుత్ బిల్లుల చెల్లింపులో 25 శాతం రాయితీ, ఐదు సంవత్సరాల వరకూ లేదా 50 లక్షల రూపాయల వరకూ సబ్సిడీ ఇస్తారు. కొన్ని నిబంధనలకు లోబడి ఎంఎస్‌ఎంఇ యూనిట్స్‌కు అద్దెలో 50 శాతం సబ్సిడీ, మార్కెట్ డెవలప్‌మెంట్‌కు చేసే ఖర్చులో 100 శాతం తిరిగి చెల్లిస్తారు. నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా గ్రాంట్‌ను, వడ్డీలో రాయితీ ఇవ్వనున్నారు. ఐటి, సెజ్, ఐటి పార్క్‌ల్లో మహిళలు కొత్తగా యూనిట్ ఏర్పాటు చేస్తే 50 శాతం అద్దె సబ్సిడీ ఇస్తారు. అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొని, అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసే మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాల్స్‌కు చెల్లించే అద్దెలో 100 శాతం తిరిగి చెల్లిస్తారు. అయితే స్టాల్ విస్తీర్ణం 9 చదరపు మీటర్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా మరికొన్ని సదుపాయాలు, రాయితీలు కల్పిస్తోంది సర్కారు. ఈ విధానాల వల్ల ఐటి పరిశ్రమలో మహిళా పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.