బిజినెస్

సామ్‌సంగ్ నోట్ 7పై ఎయిర్‌ఏషియా నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: మలేషియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా.. తమ విమానాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను నిషేధించింది. భద్రతా కారణాల దృష్ట్యా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను విమానాల్లోకి అనుమతించడం లేదంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రీకాల్ చేసినవైనా, మార్చుకున్నవైనా వ్యక్తుల వద్దగానీ, క్యాబిన్ బ్యాగుల్లో, కార్గోలోగానీ నోట్ 7లను ఉంచబోమంది. ఎయిర్‌ఏషియా ఇండియాతోపాటు, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ విభాగాలు, మలేషియా ఎయిర్‌ఏషియా ఎక్స్, థాయ్ ఎయిర్‌ఏషియా ఎక్స్, ఇండోనేషియా ఎయిర్‌ఏషియా ఎక్స్ విమానాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్స్ వినియోగంపై నిషేధం విధించినట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎయిర్‌ఏషియా స్పష్టం చేసింది. తమ నిర్ణయం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్.. కొత్త మొబైల్ గెలాక్సీ నోట్ 7 పేలుడు, అగ్నిప్రమాదాల పాలవుతోంది. ఈ ఏడాది జూలైలో మార్కెట్‌కు పరిచయమైన ఈ మొబైల్ సరఫరాను సామ్‌సంగ్ సైతం గత వారం నిలిపివేసింది.