బిజినెస్

మొండి బకాయిలు సమస్యే కాదు: కామత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్కా/బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు)ను పెద్ద సమస్యేమీ కాదన్నారు సీనియర్ బ్యాంకర్ కెవి కామత్. ‘ఇప్పటికైతే తాను ఏమీ ఆందోళన చెందడం లేదు.’ అని మొండి బకాయిలపై కామత్ వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న 8వ బ్రిక్స్ సదస్సుకు బ్రిక్స్ దేశాలు నిర్వహిస్తున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) అధ్యక్షుడిగా కామత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పిటిఐతో ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపుతో బ్యాంకులకు 2.5 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ క్రమంలోనే మొండి బకాయిలు పెద్ద సమస్య కాబోవన్నారీ ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చైర్మన్. కాగా, వచ్చే ఏడాది ఎన్‌డిబి ఇచ్చే రుణాలు రెట్టింపు అవుతాయని, వౌలికరంగ ప్రాజెక్టులకు 2.5 బిలియన్ డాలర్ల నిధులను సమకూరుస్తామని కామత్ అన్నారు. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక ప్రగతి కోసం వౌలికరంగాభివృద్ధికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) నుంచి మరింత సాయాన్ని బ్రిక్స్ దేశాలు కోరాయి. దీనికి సంబంధించిన కోటాను పెంచాలని డిమాండ్ చేశాయి.