బిజినెస్

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖపట్నం-చెన్నైల మధ్య పారిశ్రామిక నడవ (ఇండస్ట్రీయల్ కారిడర్) ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఆయా జిల్లాల పరిధుల్లో అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించింది. దీనికి ఆమోదం లభించడంతో త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. దశలవారీగా వీటిని నిర్మించి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా తొలిదశ నిర్మాణ పనులు వచ్చే ఏడాదిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం-చెన్నై ప్రాంతాల మధ్య నిర్మించే విద్యుత్ సబ్‌స్టేషన్ల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి రూ. 580 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇక టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌లోగల ఏపి ట్రాన్స్‌కో (కన్‌స్ట్రక్షన్) ప్రధాన కార్యాలయం ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విశాఖ జిల్లాకు సంబంధించి నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లకు రూ. 580 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం, విశాఖ జిల్లా నక్కపల్లి సమీపానున్న చందనాడ, అనకాపల్లి సమీపాన అచ్యుతాపురంలోను, విశాఖ నగర పరిధిలోకి వచ్చే కాపులుప్పాడ, మధురవాడ సమీపాన ఓజోన్ వ్యాలీ ప్రాంతాల్లో నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లు రానున్నాయి. కాపులుప్పాడ, ఓ జోన్ వ్యాలీ ప్రాంతాల వద్ద 132/33 కెవి సబ్‌స్టేషన్లు, అచ్యుతాపురంలో 220/32కెవి, నక్కపల్లి చందనాడలో 132/33కెవి సబ్‌స్టేషన్లను నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. అలాగే తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల పరిధిలో మరికొన్ని సబ్‌స్టేషన్లు రానున్నాయి. అయితే, ఇందులో విశాఖ జిల్లాకు సంబంధించి అచ్యుతాపురంలో వంద కోట్లతోను, నక్కపల్లి చందనాడలో రూ. 80 కోట్లతో, కాపులుప్పాడలో రూ. 195 కోట్లతోను సబ్‌స్టేషన్లను నిర్మించనుంది. మధురవాడ సమీపాన ఓ జోన్ వ్యాలీ వద్ద రూ. 205 కోట్లతో మరో సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగనుంది. నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లా పరిధిలో ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు కానుంది. అత్యంత అధునాతన పద్ధతుల్లో ఏర్పాటు చేసే విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం.. గడువులోపు పూర్తిచేయాలని ట్రాన్స్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ వచ్చేనెల నుంచి మొదలు ఏపి ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో కానున్నట్టు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.