బిజినెస్

‘సుల్తాన్’ ప్రకటనల ఆదాయం రూ. 50 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాకు చెందిన హిందీ సినిమాల చానెల్ సోనీ మ్యాక్స్‌లో ప్రసారమైన సుల్తాన్ సినిమా ప్రకటనల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ఈ ఏడాది జూలై 6న విడుదలవగా, ప్రపంచవ్యాప్తంగా 585 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి విజయవంతమైనది తెలిసిందే. దేశీయ మార్కెట్ నుంచే 421 కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే ఈ సినిమా శనివారం రాత్రి సోనీ మ్యాక్స్ టెలివిజన్‌లో ప్రసారమవగా, మధ్యమధ్యలో వచ్చిన ప్రకటనల ద్వారా భారీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రసారమైన సినిమాల్లోకెల్లా ప్రకటనల ద్వారా అధిక ఆదాయం సుల్తాన్ సినిమా ద్వారానే పొందినట్లు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ అధ్యక్షుడు (అమ్మకాలు, అంతర్జాతీయ వ్యాపారం) రోహిత్ గుప్తా పిటిఐకి చెబుతున్నప్పటికీ, ఆ మొత్తం ఎంత అన్నది ప్రకటించలేదు. అయితే ఆ మొత్తం 50 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఐదేళ్లకుగాను 61 కోట్ల రూపాయలకు సోనీ కొనుగోలు చేసింది. దీంతో శనివారం నాటి షోతోనే 50 కోట్ల రూపాయలు వచ్చాయి. సోనీ మ్యాక్స్‌లో 10 సెకండ్ల ప్రకటన ధర 10 లక్షల రూపాయలుగా ఉంటే, సోనీ మ్యాక్స్ హెచ్‌డిలో 2 లక్షల రూపాయలుగా ఉంది. చైనా మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో, రిలయన్స్ జియో కో-ప్రెజెంటర్లుగా, ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్, ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర కో-స్పాన్సర్లుగా ఈ సుల్తాన్ సినిమా షోకి వ్యవహరించాయి. బజాజ్ ఆటో, కాల్గేట్, మాండ్లేజ్, రెక్కిట్ బెన్కిసర్, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేట్ స్పాన్సర్లుగా, యాపిల్, ఈబే ఇండియా, ఫోర్డ్ ఇండియా, గూగుల్ ఇండియా, హువావీ టెలీ, ఇంటెల్, ఇంటెక్స్ టెక్నాలజీస్, లెనోవా, లోరియల్, పెర్నాడ్ రికార్డ్, రేమండ్, వివో మొబైల్స్ స్పాట్ బయ్యర్లుగా ఉన్నాయి. కాగా, బాహుబలి తర్వాత ప్రకటనల ధర 20 శాతం పెరిగిందని సోనీ పిక్చర్స్ తెలిపింది.