బిజినెస్

ఉల్లి రైతుకు కన్నీరుండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ఉల్లి పండించే రైతు కళ్లలో కన్నీరు రాకుండా చూడాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. నిరుడు కన్నా ఉల్లి అధిక దిగుబడి రావడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, అయతే రైతులు నష్టపోకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
హైదరాబాద్‌లోని తన ఇంట్లో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌లతో మాట్లాడినపుడు కనీస మద్దతు ధర ఎంత ఉంటే రైతులు నష్టపోకుండా ఉంటారో అంచనా వేయించామని, దానిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్వింటాల్‌కు ఆరు వందల రూపాయిల కనీస మద్దతు ధరను ప్రకటించిందని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను సైతం జారీ చేసిందని వివరించారు. ఉల్లి కొనుగోలు చేసేందుకు సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ నుండి కర్నూలు జిల్లాకు 20 కోట్ల రూపాయిలు మంజూరు చేశామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డుల ద్వారా కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతున్న ప్రతి రైతుకు ప్రభుత్వం డబ్బు తిరిగి చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేసేందుకు కలెక్టర్లతో కమిటీని వేశామని వివరించారు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దళారులు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. కాగా, రాష్ట్రంలో సుమారు 34 లక్షల 26 వేల 6 వందల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వచ్చిందని తెలియజేశా రు. మార్కెట్ యార్డులకు 20 నుండి 30 శాతం వరకూ వెళ్తోందని, మిగిలింది మెట్రో నగరాలకు సరఫరా అవుతుందని చెప్పారు. మార్కెట్ యార్డుల ద్వారా 100 నుండి 150 టన్నుల ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.