బిజినెస్

‘డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ అక్టోబరు 6: తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామరావు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌లో కెటిఆర్ పాల్గొన్నారు. గురువారం తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ప్రారంభమైన ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై వేర్వేరుగా జరిగిన చర్చల్లో మంత్రి కెటిఆర్ చేసిన ప్రసంగానికి పారిశ్రామిక వేత్తల ప్రశంసలు లభించాయి. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో కూడిన ఈ రెండు ప్యానెళ్లలో కెటిఆర్ మాత్రమే ఏకైన రాజకియ ప్రతినిధి. వౌలిక వసతుల రంగంలోనూ, అలాగే తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కెటిఆర్ ఈ సందర్భంగా వివరించారు. వౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రాలు ముందుకు వెళ్తాయాన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలకు మూలధనం కొరత ఉన్నందున ప్రైవేటు పెట్టుబడులతోవౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధిలో ముందుగు తీసుకెళ్లావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను కెటిఆర్ వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తీసుకొంటున్న చర్యలు, ముఖ్యంగా జాతీయ రహాదారులు, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన విప్లవత్మక మార్పుల గురించి వివరించారు. నాణ్యమైన వౌలిక సదుపాయాలను కల్పిస్తే ప్రజలకు ఉత్తమ సేవలు లభిస్తాయని, వీటిని అందుకునేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధానంగా జాతీయ రాహదారుల్లో టోల్‌ప్లాజాల వద్ద రుసుము వసూళ్లు, అలాగే విమానశ్రాయాల అభివృద్ధికి సంబంధించిన ఫీజు వసుళ్ల వంటివి విజయవంతమయ్యాయని కెటిఆర్ గుర్తు చేశారు.
అనంతరం మధ్యాహ్నం జరిగిన రెండవ ప్యానెల్ చర్చలో డిజిటలైజింగ్ ఇండియా అనే అంశంపై కెటిఆర్ ప్రసంగించారు. సమీప భవిష్యత్తులో తెలంగాణ డిజిటల్ డివైడ్ అనే అంశంలో దేశానికే ఆదర్శంగా ఉండబోతోందని అన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామదని, ప్రతి ఇంటిలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టకున్నామని కెటిఆర్ చెప్పారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్యారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటి సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను అందిస్తామన్నారు. ప్రధానంగా ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది పూర్తయితే ప్రజలకు సత్వరమే ప్రభుత్వ సేవలు అందడానికి ఆస్కారం ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వేగం పెరుగుతుందని అన్నారు. డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నామని, అందుకే తాగునీటితో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలన్న బృహత్తర సంకల్పంతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఇ-గవర్నెన్స్‌ను దాటి ఎం-గవర్నెన్స్ (మొబైల్) దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామని, తాము ఇటీవల ప్రారంభించిన ఎం-వ్యాలెట్‌ను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఈ రంగలోను తెలంగాణ అగ్రగామిగా ఉందని కెటిఆర్ తెలిపారు.