బిజినెస్

ముద్ర బ్యాంక్ ప్రథమ వార్షిక లాభం రూ. 66 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తమ కార్యకలాపాల ద్వారా సాధించిన నికర లాభం తొలి ఏడాది 65.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం 364 కోట్ల రూపాయలుగా ఉందని ముద్ర చైర్మన్ క్షత్రపతి శివాజి సోమవారం తెలిపారు. 16 బ్యాంకులకు, 25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి)కు, సూక్ష్మ రుణ సంస్థల (ఎమ్‌ఎఫ్‌ఐ)కు 3,733.25 కోట్ల రూపాయలకుగాను 3,287.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. కాగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణ సదుపాయం కల్పించడానికి ముద్ర బ్యాంక్.. 160 ఇనిస్టిట్యూషన్లతో కలిసి పనిచేస్తోంది. ఇందులో 88 బ్యాంకులు (27 ప్రభుత్వరంగ బ్యాంకులు, 17 ప్రైవేట్‌రంగ బ్యాంకులు, 31 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 13 రాష్ట్ర/పట్టణ సహకార బ్యాంకులు), 46 ఎమ్‌ఎఫ్‌ఐలు, 26 ఎన్‌బిఎఫ్‌సిలున్నాయి. ఇకపోతే 5.17 లక్షలకుపైగా ముద్ర కార్డులను ముద్ర బ్యాంక్ జారీ చేసింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన క్రింద ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 1,32,954.73 కోట్ల రూపాయల రుణాలను ముద్ర బ్యాంక్ మంజూరు చేసింది.