బిజినెస్

కొంప ముంచిన అమెరికా ‘బిగ్ డిబేట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 26: ఒక పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్, మరో పక్క ఈ వారంలో జరుగనున్న ఒపెక్ దేశాల సమావేశం వెరసి భారత స్టాక్ మార్కెట్లపై సోమవారం తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రధాన స్టాక్ మార్కెట్ సెనె్సక్స్ 374 పాయింట్లు పడిపోయింది. అంతిమంగా 28,294.28 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8,800 పాయింట్ల దిగువకు పతనమైంది. నేటి లావాదేవీల క్రమంలో ఈక్విటీ షేర్లు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. అలాగే ఆర్‌బిఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ వచ్చే నెల 4వ తేదీన జరుపనున్న తొలి ద్రవ్య విధాన సమీక్ష ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా ఇనె్వస్టర్లలో కనిపించింది. ఆసియా, ఐరోపా, వాల్‌స్ట్రీట్ మార్కెట్లు చవిచూసిన నష్టాలు కూడా బిఎస్‌ఇ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో నేటి లావాదేవీల్లో ఓఎన్‌జిసి షేర్లు బాగా నష్టపోయాయి. ఒక్కో షేరు విలువ 3.84 శాతం క్షీణించి రూ. 250.50కు చేరుకుంది. టాటా మోటార్స్ షేరు విలువ 3.22 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్‌టిపిసి, గెయిల్, ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టి, హిందుస్థాన్ యూనీ లీవర్ కంపెనీల షేర్లు 3.16 శాతం వరకు నష్టపోయాయి. ఇక లాభపడిన వాటిలో 1.19 శాతంతో కోలిండియా షేరు ముందుంది. ఆర్‌ఐఎల్ షేరు కూడా 0.58 శాతం లాభపడింది. వీటికి బలమైన వౌలిక పునాదులు ఉండటమే ఇందుకు కారణం.