బిజినెస్

వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌కు మోక్షం ఎప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ఎప్పటికి జరిగేనో తెలియని స్థితి నెలకొంది. సవివర నివేదిక ఇచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా, ఆధునీకరణ దిశగా చర్యలు తీసుకోలేదు. విశాఖలో ఫిషింగ్ హార్బర్‌లో దాదాపు 700 మెకనైజ్డ్ బోట్లు చేపల వేట సాగిస్తున్నాయి. హుదూద్ తుపాను సమయంలో జెట్టీ, తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరించేందుకు మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంపెడా) ఆధ్వర్యంలో సవివర నివేదికను 2015లో తయారు చేశారు. దాదాపు 40 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పరిశీలన, నిధుల కేటాయింపునకు పంపారు. నివేదిక పంపి సంవత్సరంపైగా కావస్తున్నా, ఇంకా ఇందుకు సంబంధించిన ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. పురాతన ఫిషింగ్ హార్బర్‌గా ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. ఉన్న కొద్దిపాటి సదుపాయాలు కూడా తుపానుకు కొట్టుకుపోయాయి. పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడం, టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, నిల్వ చేసేందుకు వసతి, చేపలు ఎండబెట్టేందుకు ఫ్లాట్‌ఫారాలు వంటివి లేవు. ఇక్కడి నుంచి సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు 20 సంస్థలకు అనుమతించారు. కానీ అపారిశుద్ధ్యం కారణంగా కేవలం నాలుగు సంస్థలే ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన 11 జెట్టీలు మినహా అదనంగా కొత్తగా నిర్వహించలేదు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన కొత్తలో 200 మెకనైజ్డ్ బోట్లు ఉండగా, ఇప్పుడు 700కు చేరుకున్నాయి. అయినప్పటికీ అదనంగా జెట్టీలను నిర్మించలేదు. విశాఖలో జరిగిన సీఫుడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జెట్టీలు, పక్కనే ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం వంటివి చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కానీ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.