బిజినెస్

కోట్లలో.. వారసుల వేతనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అంబానీలు మొదలుకొని అదానీల దాకా.. ప్రేమ్‌జీలు మొదలుకొని ఖోరకివాలాల దాకా కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న కుటుంబాలుతమ పిల్లల్ని సైతం తమ వ్యాపారాల్లో వారసులుగా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపారాభివృద్ధికి తమ వంతు సేవలందిస్తున్న పుత్ర రత్నాలకు ఆయా కంపెనీలు వేతనాలు, లేదా ఇతర సదుపాయాల రూపంలోఏటా కోట్ల మొత్తం చెల్లిస్తున్నాయి. అయితే తండ్రులు తీసుకుంటున్న వేతనాలతో పోలిస్తే వీరికి చెల్లిస్తున్న మొత్తాలు తక్కువే కావచ్చు కానీ సామాన్యుల దృష్టితో చూస్తే మాత్రం అవి పెద్ద మొత్తాలే.
ఉదాహరణకు గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు కిరణ్‌ను అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌కు సిఈఓగా నియమించారు. అయితే కిరణ్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీనుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోలేదు కానీ, 2016 సెప్టెంబర్ 1నుంచి అతనికి ఏడాదికి 1.5 కోట్ల పారితోషికం చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. అలాగే అనిల్ అంబానీ అదాగ్ గ్రూపునకు చెందిన రిలయన్స్ క్యాపిటల్‌లో ఇటీవల డైరెక్టర్‌గా నియమితుడైన ఆయన కుమారుడు అన్‌మోల్‌కు నెలకు 10 లక్షల రూపాయల వేతనం చెల్లించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ నెల 27న జరిగే కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తీసుకోనున్నారు. ఈ జీతం కాకుండా అతనికి మిగతా అలవెన్స్‌లు, పెర్క్‌లతో పాటుగా కంపెనీకి వచ్చే లాభం ఆధారంగా కమిషన్ కూడా లభిస్తుంది. అనిల్ సోదరుడు ముకేశ్ అంబానీ పిల్లలు ఆకాశ్, ఇషాలు రిలయెన్స్ గ్రూపు టెలికాం, రిటైల్ వెంచర్లలో చురుకైన పాత్రే పోషిస్తున్నప్పటికీ వారి జీతభత్యాలేమిటో మాత్రం బయటికి వెల్లడి కాలేదు.
మరోవైపు టివిఎస్ మోటార్స్ అధినేత వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణుకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ 9.59 కోట్ల పారితోషికం లభించింది. అయితే కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన పారితోషికాన్ని మరింత పెంచడానికి కంపెనీ గత నెల షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కోరింది. ఇక విప్రోలో స్ట్రాటజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ పారితోషికం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.15 కోట్లుగా ఉంది. ఆయన తండ్రి అజీమ్ ప్రేమ్‌జీ పారితోషికం కూడా దాదాపు అంతే అంటే రూ.2.17 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక వోక్‌హార్ట్ చైర్మన్ హబిల్ ఖోరాకివాలా, ఆయన కుమారులు హుజైఫా(ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), ముర్తజా(మేనేజింగ్ డైరెక్టర్) వేతనాలు సమానంగా ఉండడం గమనార్హం. వీరంతా ఒక్కొక్కరు సంవత్సరానికి రూ. 1.32 కోట్ల వేతనం తీసుకుంటున్నారు. హబిల్ కుమార్తె జహబియా వోక్‌హార్ట్ ఆస్పత్రుల వ్యవహారాలు చూస్తున్నప్పటికీ ఆమె జీతభత్యాల వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఫ్యూచర్స్ గ్రూపు చైర్మన్ కిశోర్ బియానీ కుమార్తె అష్ని, సుజ్లాన్ ఎనర్జీ అధినేత తుల్సి తంతి కుమార్తె నిధి, డిఎల్‌ఎఫ్ సంస్థ చైర్మన్ కెపి సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్, కుమార్తె రేణుకా తల్వార్‌లాంటి వారు కూడా ఆయా కంపెనీల్లో నిర్వహిస్తున్న బాధ్యతలకు గాను భారీ మొత్తంలోనే పారితోషికాలు తీసుకుంటున్నారు. తండ్రుల వ్యాపార సామ్రాజ్యాలకే వారసులుగా ఎదుగుతున్న వీరంతా కూడా భారీ జీతభత్యాలు తీసుకునే విషయంలోను వారి బాటలోనే నడుస్తూ ఉండడం గమనార్హం.

చిత్రాలు..ఆకాష్ అంబానీ, ఇషా అంబనీ,
అన్‌మోల్ అంబానీ