బిజినెస్

సింగరేణి థర్మల్ యూనిట్-1లో విజయవంతంగా సిఒడి రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్-1లో నిర్వహించిన సిఒడిరన్ విజయవంతమైంది. ఆదివారం సింగరేణి అధికారులతోపాటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలంగాణ స్టేట్ సదరన్ డిస్కం, తెలంగాణ స్టేట్ నార్త్ డిస్కం అధికారుల సమక్షంలో సిఒడి రన్ జరిగింది. యూనిట్ 1నుంచి 72 గంటల సిఒడి పరీక్ష విజయవంతమైందని, 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో సగటున 612 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఎలాంటి ఆటంకం లేకుండా సాగిందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనపై ఇరుపక్షాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. కీలకమైన చివరి మైలురాయిని విజయవంతమైన సందర్భంగా జైపూర్ విద్యుత్ కర్మాగారంలో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. ఈ మేరకు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్ శ్రీ్ధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వడానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి వాణిజ్య పరంగా విద్యుత్ అమ్మకం..
మొదటి ప్లాంట్ మార్చి 13న సింక్రనైజేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు యూనిట్-1లో 460 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని, దీన్ని గజ్వేల్‌లోని పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశామని చైర్మన్ తెలిపారు. దీంతో సోమవారం నుంచి సింగరేణి విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలు అధికారికంగా కొనుగోలు చేస్తారని చైర్మన్ పేర్కొన్నారు.