బిజినెస్

స్వల్ప లాభాలకే... పరిమితమైన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 24: అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక సమావేశాల నేపథ్యంలో మదుపరులు అచితూచి పెట్టుబడులు పెట్టడంలాంటి కారణాలతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 69.19 పాయింట్లు లాభపడి 28,668.22 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 51.70 పాయింట్లు లాభపడి 8,831.55 పాయింట్ల వద్దకు చేరుకుంది. మదుపరుల మనసంతా కూడా రెండు ప్రధాన జాతీయ బ్యాంకులైన అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక సమావేశాలకే పరిమితం కావడంతో వారం ప్రారంభం ఆటుపోట్లతోనే మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలులాంటి అనేక కారణాలతో మదుపరులు అంతకు ముందు వారంలో పొందిన లాభాలతో మరింత పటిష్ఠం చేసుకోవడానికే ప్రయత్నించారు. అయితే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో పాటుగా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి విధానపరంగా కొత్త నిర్ణయాలను తీసుకుంటూ బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయాలతో మదుపరులు పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ప్రధాన సూచీలు ప్రారంభంలో ఆర్జించిన లాభాలు ఆవిరై పోయాయి. అదే ధోరణి రెండు మూడు రోజులు కొనసాగింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మార్కెట్లలో నిజమైన రికవరీ మొదలైందని చెప్పారు. ఈ నిర్ణయానికి సానుకూలంగా ప్రపంచ మార్కెట్లు స్పందించడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) మార్కెట్లనుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయన్న భయాలు తొలగిపోయి దేశీయ మార్కెట్లలో ఇనె్వస్టర్ల సెంటిమెంట్ కూడా సానుకూలంగా మారింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పతనం అయిన తర్వాత ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు రావడం, అలాగే ఇటీవల బాగా పెరిగిన బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడం లాంటి కారణాలతో వారాంతంలో మళ్లీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వచ్చే వారం సెప్టెంబర్ నెల ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేటివ్స్ గడువు ముగుస్తూ ఉండడం లాంటి కారణాలతో మొత్తం మీద ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమైనాయి.