బిజినెస్
వజ్రాలు, ఆభరణాల రంగంలో బీమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్‌కతా, మార్చి 21: ఇతరత్రా రంగాల మాదిరిగానే వజ్రాలు, ఆభరణాల రంగంలోనూ బీమా సదుపాయం ఉండాలని వ్యాపారవేత్తలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సూచించింది. దీని వల్ల బ్యాంకులు మరింత స్వేచ్ఛగా, భయాందోళనలు లేకుండా రుణాలను అందచేయానికి వీలుంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ రంగంలో ఎస్బీఐ రుణాలు 20,000 కోట్ల రూపాయలని ఆ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (క్లయింట్స్ గ్రూప్-1) పీఎన్ ప్రసాద్ అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రుణ పరిమితిని పెంచే ఆలోచన ప్రస్తుతం బ్యాంక్‌కు లేదని స్పష్టం చేశారు. బీమా లేని కారణంగా, బకాయిల ఎగవేత భయం సహజంగానే బ్యాంకులను ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. నీరవ్ మోదీ ఉదంతం తర్వాత వజ్రాలు, ఆభరణాల రంగంపై నమ్మకం సడలిపోయిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు రూ.14,000 కోట్ల మేరకు ఎగవేసిన నీరవ్ మోదీ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రసాద్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగాలని అన్నారు. అదే సమయంలో బీమా కవరేజీ ఉండాలని అన్నారు. మైక్రో, స్మార్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) సెగ్మెంట్‌లో వజ్రాలు, ఆభరణాల వ్యాపారాన్ని ప్రోత్సహించాలంటే, బీమా సౌకర్యాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.