బిజినెస్

ఆరోగ్య బీమా పాలసీలతో కరోనాకు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 5: దేశంలోని దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలు కరోనా వైరస్ సహా అన్ని అంటు వ్యాధులను కవర్ చేస్తాయని జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ గురువారం నాడు వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న పాలసీలలో కరోనా వైరస్‌ను కూడా కవర్ చేయాలని, కరోనా వైరస్ క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని బీమా సంస్థల నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరి అండ్ డెవలప్‌మెంట్ అథారిటి ఆఫ్ ఇండియా) బుధవారం బీమా కంపెనీలను ఆదేశించిన నేపథ్యంలో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటన వెలువడింది. ‘ఇప్పటికే తీసుకొని ఉన్న దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలు కరోనా వైరస్ సహా దాదాపు అన్ని అంటు వ్యాధులను కవర్ చేస్తాయి. ఒక కొత్త పాలసీని రూపొందించకుండా, అమలులో ఉన్న పాలసీలతోనే కరోనా వైరస్ కేసులలో త్వరగా చికిత్స అందించాలని నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇండస్ట్రీని ఆదేశించింది’ అని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ ఏవీ గిరిజాకుమార్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్యను పెంచేందుకు ప్రజలలో అవగాహన కల్పించడానికి గురువారం నాడిక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గిరిజాకుమార్ విడిగా ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలో గురువారం నాటికి 30 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్నారు. ఆరోగ్య బీమా పాలసీ కింద కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన ఆసుపత్రుల క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని ఐఆర్‌డీఏఐ బుధవారం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. 25 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆరు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, రెండు ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీలు, 11 రీఇన్సూరెన్స్ కంపెనీలు కలిపి మొత్తం 44 ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడిన ఇండస్ట్రీ ప్రజల్లో అవగాహనను పెంచడానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి నిధులు సమకూరుస్తోందని గిరిజాకుమార్ తెలిపారు.