బిజినెస్

పన్ను బకాయిల చెల్లింపు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4:పన్ను బకాయిలు చెల్లించే గడువును ఈనెల 31వ తేదీవరకు పెంచే బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీలోగా పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 4.83 లక్షల పన్ను బకాయిల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 9.32 లక్షల కోట్ల రూపాయలు. కాగా, బకాయిదారులకు పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వెసులుబాటును కల్పించాలని ‘ద డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్’ను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. దీనికి లోక్‌సభ ఆమోదం తెలిపింది.