బిజినెస్
దేశీయ మార్కెట్లపై కరోనా దెబ్బ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, మార్చి 4: కరోనా వైరస్ బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశీయ మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం తీవ్ర అనిశ్చితిలో కొనసాగి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 214 పాయింట్ల దిగువన ముగిసింది. ఇంట్రా-డేలో 945 పాయింట్ల పరిధిలో పైకి కిందికి కదలాడిన ఈ సూచీ చివరకు 214.22 పాయింట్ల (0.55 శాతం) దిగువన 38,409.48 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 52.30 పాయింట్ల (0.46 శాతం) దిగువన 11,251 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బుధవారం నష్టపోగా, సన్ ఫార్మా, టెక్ మహీంద్ర, ఎంఅండ్‌ఎం, ఆసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. భారత్‌లో 28 కరోనా వైరస్ కేసులను ధ్రువీకరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం డీలా పడ్డాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభం అయ్యేటప్పటికి దేశంలో కేవలం ఆరు కరోనా వైరస్ కేసులను మాత్రమే ధ్రువీకరించారు. మరోవైపు, వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. అయితే, ఈ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు భారత స్టాక్ మార్కెట్లలో ఇనె్వస్టర్లను ఆకట్టుకోలేక పోయింది. ‘కరోనా వైరస్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు ముప్పు పొంచి ఉంది’ అని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా నియంత్రిస్తాయనే దానిపై చాలా అనిశ్చితి నెలకొని ఉందని అషికా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటి రీసెర్చ్ పేర్కొంది. ‘కరోనా వైరస్ కారణంగా అనిశ్చితికి గురయ్యే మార్కెట్లను అమెరికా కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఎంతవరకు స్థిరపరచగలుగుతుందనేది సందేహమే’ అని ఆ సంస్థ పేర్కొంది. షాంఘై, సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిశాయి. అయితే, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ మాత్రం ప్రతికూల ధోరణిలో ముగిసింది. యూరప్‌లో స్టాక్ మార్కెట్లు ఒక శాతం వరకు ఎగువన మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 0.58 శాతం పెరిగి, ఒక బారెల్‌కు 52.16 డాలర్లకు చేరుకుంది. ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ బుధవారం ఇంట్రా-డేలో అమెరికా డాలర్‌తో పోలిస్తే 14 పైసలు తగ్గి 73.34 వద్దకు చేరింది.