బిజినెస్

నష్టాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 3: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు గత ఎనిమిది రోజుల లావాదేవీల్లో ఎదుర్కొంటున్న నష్టాలకు మంగళవారం తెరపడింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 479.68 పాయింట్లు మెరుగుపడి, 38,523.70 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 170.55 పాయింట్లు లాభపడి, 11,303.30 పాయింట్లకు చేరుకుంది. బీఎస్‌ఈలో ఉదయం లావాదేవీలు మొదలైనప్పుతు పతనం కొనసాగింది. దీనితో మరోసారి భారీ నష్టిలు తప్పవనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. దాదాపు మధ్యాహ్నం వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. తర్వాత కొద్దిసేపు ట్రేడింగ్ లాభాల బాటపట్టినప్పటికీ, మరోసారి పతనం నమోదైంది. కానీ, సుమారుగా చివరి రెండు గంటల్లో నష్టాలను అధిగమించి ముందుకు దూసుకెళ్లింది. సన్ ఫార్మా, టాటా స్టీల్ వంటి కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ ట్రేడింగ్ ఇదే రీతిలో కొనసాగింది. వేదాంత, సన్ ఫార్మా వంటి కంపెనీలు లాభాల బాటపట్టగా, నిఫ్టీ నష్టాల ఊబి నుంచి కోలుకొని, లాభాల్లోకి పరుగులు తీసింది. బీఎస్‌ఈలో సన్ ఫార్మా వాటాలు 6.64 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. టాటా స్టీల్ 6.43 శాతం, ఓఎన్‌జీసీ 4.71 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 4.67 శాతం, ఎన్‌టీపీసీ 4.23 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా ఉండడంతో, దేశీయ మార్కెట్లు లాభపడినప్పటికీ, ఐటీసీ వాటాలు 0.87 శాతం నష్టాలను చవిచూశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 0.07 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత షేర్లు అత్యధికంగా 8.34 శాతం లాభపడ్డాయి. సన్ ఫార్మా 7.17 శాతం, హిండాల్‌కో 6.91 శాతం, జీ ఎంటర్‌టైనె్మంట్ 6.91 శాతం, టాటా స్టీల్ 6.66 శాతం చొప్పున లాభాలు ఆర్జించాయి. అయితే, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ ఐటీసీ నష్టాలను ఎదుర్కొంది. ఆ కంపెనీ వాటాలు 0.64 శాతం నష్టాలను చవిచూశాయి. ఎస్ బ్యాంక్ వాటాల ధర 0.48 శాతం పతనమైంది.
కరోనా వైరస్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తలెత్తుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, దేశీయ మార్కెట్‌పై దీని ప్రభావం లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ చేసిన ప్రకటన మదుపరుల్లో కొత్త ఆశలు నింపింది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు సెంటిమెంట్లతో పోలిస్తే, దేశీయ మదుపరుల సానుకూల స్పందన కొట్టొచ్చినట్టు కనిపించింది. వారు కొనుగోళ్ల పట్ల ఆసక్తి ప్రదర్శించకపోతే, గత వారం రోజులు మాదిరిగానే స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొని ఉండేవి. ఇలావుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 2.93 శాతం (53.42 డాలర్లు) పెరిగింది. రూపాయి మారకం విలువ 40 పైసలు పతనమైంది. దీనితో డాలర్ విలువ 73.16 రూపాయలకు చేరింది.