బిజినెస్

పన్ను వివాదాలకు వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్‌లో తాము ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ఆదాయం పన్ను కేసుల పరిష్కారానికి ఎంతగానో తోడ్పడుతోందని, సమయంతోపాటు డబ్బూ ఆదా అవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోందని అన్నారు. అనేక ట్రిబ్యునళ్లు, కోర్టుల్లో 9.32 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన 4.83 లక్షల ప్రత్యక్ష పన్నుల కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము చేపట్టిన పథకం పన్నుల వివాదాల పరిష్కారానికి అవకాశాన్ని ఇస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ కేసుల పరిష్కారానికి ప్రజలు ఎంతో ఖర్చు చేయడంతోపాటు వారి సమయమూ వృథా అవుతోందని తెలిపారు. ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వివాదాలను తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని, పరోక్ష పన్నుల వివాదానికి సంబంధించి కూడా ఈ తరహా పథకాన్ని ప్రకటించామని సీతారామన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత పథకం ద్వారా మార్చి 31లోగా వివాదంలో ఇరుక్కున్న పన్నుల మొత్తాన్ని చెల్లించేవారికి వడ్డీ, ఫెనాల్టీ పూర్తిగా మినహాయిస్తారు. అయితే, చెల్లించాల్సిన పన్నుల మొత్తంపై అదనంగా మరో 10 శాతం వివాద పన్నును కూడా వీరు కట్టాల్సి ఉంటుంది. 2020 జూన్ 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

*చిత్రం... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్