బిజినెస్

అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్‌కు మాత్రమే కరోనా వైరస్ ప్రభావం పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సూచీలు కూడా పతనమవుతున్నాయి. గత మూడు రోజుల సూచీలను పరిశీలిస్తే, భారత్‌లో సెనె్సక్స్ వరుసగా 1.96 శాతం, 0.20 శాతం, 0.97 శాతం నష్టపోయింది. జపాన్ మార్కెట్ నిక్కీకి సోమవారం సెలువు దినంకాగా, ఆతర్వాతి రెండు రోజుల్లో 3.3 శాతం, 0.78 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హాంగ్‌సెంగ్ (హాంకాంగ్ మార్కెట్) సోమవారం 0.9 శాతం నష్టాలను ఎదుర్కొంది. మంగళవారం కొంత మెరుగుపడి 0.27 శాతం లాభాల్లో ముగించినప్పటికీ, బుధవారం తరిగి నష్టాల్లోకి జారుకుంది. 0.73 శాతం పతనంతో ముగిసింది. షాంఘై (చైనా) మార్కెట్ వరుసగా 1.5 శాతం, 0.60 శాతం, 0.83 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. అయితే, హాంసెంగ్ మాదిరిగానే కోస్పీ (దక్షిణాఫ్రికా) మార్కెట్ మొదటి రోజు నష్టాలను (3.1 శాతం) చవిచూసినప్పటికీ, రెండో రోజైన మంగళవారం (1.18 శాతం) లాభాల్లో నడిచింది. బుధవారం మళ్లీ నష్టాల్లోకి (1.28 శాతం) జారుకుంది. ఎఫ్‌టీఎస్‌ఈ (బ్రిటన్) మార్కెట్ వరుసగా 0.99 శాతం, 0.76 శాతం చొప్పున నష్టపోయినప్పటికీ, బుధవారం 0.35 శాతం లాభాలను ఆర్జించింది. డాక్స్ (జర్మనీ) మార్కెట్ వరుసగా 0.61 శాతం, 1.09 శాతం, 0.12 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. డోజోన్స్ (అమెరికా మార్కెట్) మొదటి రెండు రోజుల్లో వరుసగా 3.56 శాతం, 2.77 శాతం నష్టాల్లో ట్రేడ్‌కాగా, బుధవారం 0.53 శాతం లాభాలను ఆర్జించాయి.
కాగా, గురువారం దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది.