బిజినెస్

మార్కెట్లకు కరోనా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 27: చైనా నుంచి వివిధ దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 2,750 మంది మృతి చెందగా, ఇది సోకిన సుమారు 80,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మదుపరులు భయాందోళనలకు గురికావడంతో, అంతర్జాతీయంగా మార్కెట్ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, స్టాక్ మార్కెట్లలో సూచీల పతనం గురువారం కూడా కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 465.69 పాయింట్ల వరకూ పతనమైంది. అయితే, భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, పెట్టుబడులను ఉపసంహరించుకునే ఆలోచన మానుకోవాలని మార్కెట్ నిపుణులు పదేపదే పేర్కోవడంతో, మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. కానీ, నష్టాలు మాత్రం తప్పలేదు. సెనె్సక్స్ 143.30 పాయింట్లు (0.36 శాతం) పతనమై 39,745.66 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 45.20 పాయింట్లు (0.39 శాతం) పడిపోవడంతో 11,633.30 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈలో ఎక్కువగా ఓఎన్‌జీసీ స్టాక్స్ నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వాటాల విలువ 2.61 శాతం తగ్గడం మదుపరులను ఆందోళనకు గురి చేసింది. హెచ్‌సీఎల్ టెక్ వాటాలు 2.25 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర వాటాల 2.01 శాతం, ఎస్బీఐ వాటాలు 1.92 శాతం, ఇండస్‌ఇండ్ వాటాలు 1.72 శాతం చొప్పున నష్టాల్లో కొనసాగాయి. కాగా, ప్రతికూలతను సమర్థంగా ఎదుర్కొన్న సన్ ఫార్మా షేర్లు 3.68 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. టైటాన్ 1.87 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.17 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.97 శాతం, మారుతి సుజికీ 0.77 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో విప్రో వాటాలు భారీగా నష్టపోయాయి. 3.52 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. జేఎస్‌డబ్యూ స్టీల్ 3.03 శాతం, ఓఎన్‌జీసీ 3.03 శాతం, ఐఓసీ 2.49 శాతం, జీ ఎంటర్‌టైనె్మంట్ 2.33 శాతం చొప్పున లభాలను సంపాదించాయి. బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ సన్ ఫార్మా స్టాక్స్ భారీ లాభాలను ఆర్జించాయి. ఈ కంపెనీ వాటాలు 3.55 శాతం అధిక ధరకు అమ్ముడయ్యాయి. బ్రియానిటీ 1.93 శాతం, టైటాన్ 1.86 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.08 శాతం, గ్రాసిమ్ 1.08 శాతం చొప్పున లాభాలు సంపాదించాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అత్యంత తక్కువగా, 4.5 శాతం మాత్రమే నమోదు కావడం కూడా భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది.
కాగా, జీడీపీని పెంచేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. జీడీపీ నిరాశాజనకంగానే ఉంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు 1.33 శాతం తగ్గడంతో 52.11 డాలర్లకు చేరింది. ఇన్‌ట్రా డేలో రూపాయి మారకపు విలువ పెరిగి, డాలర్‌కు 71.62 రూపాయలుగా స్థిరపడింది.