బిజినెస్

ఢిల్లీ నుంచి విశాఖకు మూడో విమాన సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఢిల్లీ నుంచి విశాఖకు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు విశాఖ నుంచి విమానాల రాకపోకలకు అవరోధంగా నిలిచాయి. అయితే విశాఖ విమాన ప్రయాణికుల విజ్ఞప్తికి స్పందించిన పౌర విమానయాన శాఖా మంత్రి పి అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి మరో సర్వీసును విశాఖకు నడిపేందుకు అంగీకరించారు. ఈ నెల 28 నుంచి ఇండిగో సంస్థ ఢిల్లీ నుంచి విశాఖకు విమాన సర్వీసును ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి విశాఖ నుంచి స్పైస్ జెట్ ఒక సర్వీసును నడుపుతోంది. దీనితో పాటు ఉదయం వేళల్లో ఎయిర్ ఇండియా మరో సర్వీసును ఢిల్లీకి నడుపుతోంది. తాజాగా ఇండిగో సంస్థ ఢిల్లీ నుంచి సాయంత్రం బయలుదేరి నేరుగా విశాఖ చేరుకునే విధంగా కొత్త సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సర్వీసు రాత్రి 7.50 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ చేరుకుని, తిరిగి ఇక్కడ నుంచి 10.50 గంటలకు బయలుదేరి రాత్రి 11.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 7.45 గంటలకు విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి తిరిగి బయలుదేరి హైదరాబాద్‌కు 8.40 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలో
పర్యాటకుల కోసం హాంకాంగ్, మకావ్, షెంజెన్ పట్టణాలను కలుపుతూ కొత్త ప్యాకేజీలను ఐఆర్‌సిటిసి సంస్థ ప్రవేశపెట్టింది. దసరా సెలవులు సందర్భంగా వచ్చేనెల 8 నుంచి 12 వరకు ఉండే ఈ పర్యటనలో హాంకాంగ్ రెండు రాత్రిళ్ళు ఉండగా హాఫ్ డే సిటీ టూర్, మేడం టుస్సాడ్స్ మ్యూజియం, హాంకాంగ్‌లోని ఎతె్తైన భవనం నుండి సిటిని చూడటం, ప్రపంచ ప్రఖ్యాత లైట్ అండ్ సౌండ్ షో, హాంకాంగ్ డిస్నీలాండ్ రిసార్ట్‌లు సందర్శించే అవకాశం ఉంటుంది. షెంజైన్ పర్యటనలో భాగంగా మినరల్స్ మ్యూజియం, లోటస్ స్క్వేర్, దివాంగ్ మాన్సన్, విండోస్ ఆఫ్ ద వరల్డ్, మకాన్ పర్యటనలో ఏ మా టెంపుల్ సెంట్‌పాల్ చర్చ్, సెనడొస్కేర్, కం లం స్టాట్యు, లోటస్ స్క్వేర్ వంటివి సందర్శించే విధంగా ప్యాకేజీని రూపొందించింది. శ్రీలంక రామాయణ యాత్ర, శాంకరిదేవి శక్తిపీఠం పేరుతో విదేశీ నాల్గవ యాత్రను డిసెంబర్ 10 నుండి 14వరకు నిర్వహించనుంది. ఎస్‌జి 1042, 3 విమాన సర్వీస్ హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9.55కు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 1.50 గంటలకు చేరుకుంటుంది. ఇదే విమాన సర్వీసు(ఎజి-4, 1314) కొలంబోలో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. ఈ విధంగా నాలుగు రాత్రిళ్ళు, నాలుగు డేలు కొలంబో, సిగిరియా, కాం, నువార ఎలియా ప్రాంతాలను సందర్శించే విధంగా ప్యాకేజీ రూపొందించింది. ఫుంచి కట్రగామ, మనవారి, మునే్నస్వరం దేవాలయాలు, ట్రికోమలి, తిరుకోనేస్వరం, శాంకరీదేవి శక్తిపీఠం, లక్ష్మీనారాయణ దేవాలయాలు, డరైన్ సిగారియ రాక్, డంబుల్ల గోల్డెన్ స్టాట్యూ, కాండి, సిటిటూర్, టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్, టీ ఫ్యాక్టరీ, రాంబోడ హనుమాన్ టెంపుల్, గాయత్రీ పీఠం, సీత అమ్మన్ టెంపుల్, అశోక్ టెంపుల్, హక్ గల గార్డెన్, కొలంబో సిటీ టూర్‌లు వంటి ప్రముఖ ప్రదేశాలు చూపిస్తారు. శ్రీలంకకు వెళ్ళే ఒక్కో ప్రయాణికుడు రూ.45,001లు చెల్లించాల్సి ఉంటుంది.