బిజినెస్

హౌసింగ్ ఫైనాన్స్ విలీనం ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: తమ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను మరే ఇతర సంస్థతోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని జీవిత బీమా కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంక్‌తో తమ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను ఎల్‌ఐసీ విలీనం చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను ఇతర సంస్థతో విలీనం చేస్తారంటూ వచ్చిన వార్తలన్నీ వదంతులేనని, వీటికి ఎలాంటి ఆధారమూ లేదని ఎల్‌ఐసీ వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇందుకు సంబంధించి మరో వివరణ ప్రకటన జారీ చేసింది.