బిజినెస్

భారత వృద్ధి రేటు 5.4 శాతం..అంచనాలు తగ్గించిన మూడీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం 2020 సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.6 శాతం నుంచి 5.4 శాతానికి కుదించింది. తాజాగా ఇందుకు సంబంధించి తన అంచనాలను వెల్లడించిన మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ సంస్థ గత రెండేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా గాడి తప్పిందని, ఆర్థిక రికవరీ అన్నది అనుకున్నంత తేలిక కాదని తెలిపింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో కొంతమేర దేశ ఆర్థిక వ్యవ స్థ పుంజుకోవచ్చునని, కానీ ఇది అనుకున్నంత వే గంగా జరుగకపోవచ్చునని తెలిపింది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును తగ్గించడానికి కారణం అంతర్గత అంశాలే తప్ప బహిర్గత సవాళ్లు కాదని మూడీ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్ పరపతి వృద్ధిని పెం పొందించుకోవడంతోపాటు దేశీయ డిమాండ్‌ను పునరుద్ధరించుకోవడం ద్వారానే ఆర్థికంగా భారత్ బలోపేతం అవుతుందని ఈ సంస్థ తెలిపింది. అ యితే, డిమాండ్ మాంద్యాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై భారత్ తన తాజా బడ్జెట్‌లో ఎలాం టి ప్రతిపాదనలూ చేయలేదని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ బలహీన పడడం, వృద్ధి రేటు కూడా అదే చందంగా మారడం వల్ల త్వరితగతిన భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పడం కష్టమని ఈ సంస్థ వివరించింది. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా నెలకొన్న ఈ రకమైన విధానాలను పరిశీలించిన మీదటే తామీ విశే్లషనకు వస్తున్నామని వివరించింది. పన్నులు తగ్గించినంత మాత్రాన ఇటు వినియోగదారులు, అటు వ్యాపార సంస్థలు భారీగా ఖర్చుపెడతాయని ఏమీ లేదని తెలిపింది. అయితే, రిజర్వు బ్యాంకు మరింతగా సానుకూల నిర్ణయాలు తీసుకోగలదనే ఆశాభావాన్ని వెల్లడించింది.