బిజినెస్

గుంటూరు యార్డును ముంచెత్తిన మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: ఆసియా ఖండంలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు గురువారం ఒక్కరోజే 1,57,250 బస్తాలను రైతులు విక్రయించుకునేందుకు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మిర్చి ఎగుమతుల్లో మాంద్యం నెలకొంది. ధరలు పతనమవుతున్న నేపథ్యంలో రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు మిర్చియార్డులో బారులు తీరుతున్నారు. రానున్న కాలంలో ధర మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలతో రైతులు పంటను మిర్చియార్డుకు తీసుకు వస్తున్నారు. నాన్ ఏసీ కామన్ వెరైటీ 334 కనీస ధర 3 వేల రూపాయలు కాగా, గరిష్ఠంగా 15 వేలకు కొనుగోలు చేశారు. నెంబర్ 5 వెరైటీ 5,600 కనిష్ఠ ధర కాగా గరిష్ఠ ధర 14 వేలు, 273 వెరైటీ కనిష్ఠ ధర 5,500 కాగా గరిష్టంగా 15 వేలు, 341 వెరైటీ కనీస ధర 3 వేలు కాగా గరిష్ఠంగా 15,200 రూపాయలు, 4884 రకం 5 వేలు కనిష్ఠం కాగా గరిష్ఠంగా 13,500, సూపర్ 10 రకం కనిష్ఠం 6 వేలు కాగా గరిష్ఠంగా 3,800 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా సగటు ధర 3 వేల నుండి 15,200 వేల రూపాయల వరకు పలికింది. నాన్ ఏసీ స్పెషల్ రకాల్లో తేజ కనిష్ఠం 3,500 - గరిష్ఠం 16,100 రూపాయలు, బడిగి రకం కనిష్ఠం 5 వేలు - గరిష్ఠం 15,700, దేవనూరు డీలక్స్ రకం కనిష్ఠం 6 వేలు - గరిష్ఠం 16,200 రూపాయలు పలికింది. సగటు ధర 3,500 నుండి 16,200 రూపాయలకు కొనుగోలు చేశారు. కాగా తాలు మిర్చిని సగటు 2,500 నుండి 10 వేల రూపాయల వరకు యార్డులో కొనుగోలు చేస్తున్నారు.

*చిత్రం... గుంటూరు యార్డుకు వెల్లువెత్తిన మిర్చి బస్తాలు