బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈవారం ట్రేడింగ్ మొదటి రోజునే నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 236.52 పాయింట్లు మెరుగుపడి, 41,216.14 పాయింట్లకు చేరగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 76.40 పాయింట్లు లాభపడి 12,107.90 పాయింట్లుగా నమోదైంది. సెనె్సక్స్ ప్రారంభంలో పరుగులు తీసినప్పటికీ, ఆతర్వాత నష్టాల్లోకి జారుకుంది. అయితే, మధ్యాహ్నం తర్వాత తిరిగి లాభాల్లోకి వెళ్లింది. చివరిలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో కొంత తగ్గుదల కనిపించింది. అయితే, స్థూలంగా ట్రేడింగ్ లాభాల్లోనే ముగియడంతో అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు ఊపిరి పీల్చుకున్నారు. బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ వాటాలు అత్యధికంగా 2.95 శాతం లాభాలను ఆర్జించాయి. మారుతీ సుజికీ 2.07 శాతం, ఎస్బీఐ 1.84 శాతం, పవర్‌గ్రిడ్ 1.53 శాతం, బజాజ్ ఆటో 1.35 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, మార్కెట్‌ను భారతీ ఎయిర్‌టెల్ అందిపుచ్చుకోలేక పోయింది. ఆ కంపెనీ వాటాలు 0.75 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (0.69 శాతం), నెస్లే (0.61 శాతం), టీసీఎస్ (0.52 శాతం), సన్ ఫార్మా (0.42 శాతం) కంపెనీల షేర్లు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఎన్‌ఎస్‌ఈలో గెయిల్ బాగా లాభపడింది. ఈ కంపెనీ వాటాలు ఏకంగా 6.03 శాతం లాభాలను సంపాదించాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.90 శాతం, భారతీ ఇన్‌ఫ్రా 3.75 శాతం, ఎన్‌టీపీసీ 2.95 శాతం, మారుతీ సుజికీ 2.04 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, ఎస్ బ్యాంక్ వాటాలు 1.86 శాతం నష్టాలను చవిచూశాయి. నెస్లే (1.08 శాతం), బీపీసీఎల్ (0.92 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (0.82 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (0.83 శాతం) కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. మార్కెట్ విశే్లషకుల అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారులంతా చైనా నుంచి వచ్చే సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ చంద్రమానం ప్రకారం నూతన సంవత్సరాదిని జరుపుకొంటున్న కారణంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అనంతరం, కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, సెవును పెంచారు. దీనితో మంగళవారం చైనాలో స్టాక్ మార్కెట్లు పునఃప్రారంభమయ్యాయి. అక్కడి ట్రెండ్స్‌పై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు మందగొడిగా నిడిచాయి. బుధవారం నాటికి పరిస్థితి పుంజుకుంటుందన్న ధీమా మార్కెట్లలో వ్యక్తమవుతున్నది.