బిజినెస్

‘ఎగుమతుల లక్ష్యం పది బిలియన్ డాలర్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వచ్చే 2020 నాటికి భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ ఎ జయతిలక్ తెలిపారు. విశాఖలో 23 నుంచి ప్రారంభం కానున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బుధవారం వచ్చిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 8 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 9.5 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రూ.4.7 బిలియన్ డాలర్ల (రూ.30,420 కోట్లు) ఆదాయాన్ని పొందినట్టు వెల్లడించారు. భారతదేశం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే పైచేయిగా ఉందన్నారు. గతేడాది ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.13వేల కోట్లని తెలిపారు. దేశ ఎగుమతుల్లో ఇది 45 శాతంగా పేర్కొన్నారు. 2020 నాటికి ఎపి నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రూ.27 వేల కోట్లను దాటుతుందన్నారు.
ది సీ ఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వి పద్మనాభం మాట్లాడుతూ విశాఖలో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 20వ ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ ఫెస్టివల్ భారతదేశంలో భవిష్యత్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల అభివృద్ధి, ఎగుమతుల వృద్ధికి మరింత దోహదం చేస్తుందన్నారు. వివిధ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు ఇటువంటి వేదికలు ఉపకరిస్తాయన్నారు. సీ ఫుడ్ ఫెస్టివల్‌కు అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫిన్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, యుకె, వియత్నాం, చైనా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయన్నారు. 200 మందికి పైగా విదేశీ అతిధులు, 1200 మంది స్వదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ముఖ్యంగా ఇటువంటి సదస్సులు ఎగుమతి, దిగుమతి దార్ల మధ్య అవగాహనకు సానుకూల వాతావరణం కల్పిస్తాయన్నారు. సమావేశంలో ఎంపెడా సెక్రటరీ జనరల్ ఎలియాస్, కార్యదర్శి బి శ్రీకుమార్, ఎపి రీజియన్ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.