బిజినెస్

9 నెలల్లో 6.77 శాతం తగ్గిన బంగారం దిగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: బంగారం దిగుమతులు గత 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 6.77 శాతం తగ్గాయి. ఈ కాలంలో మొత్తం 23 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకు క్రితం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 24.73 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతులు జరుగగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన కరెంటు ఖాతాల లోటు (సీఏడీ) 6.77గా ఉందని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఇలా బంగారం దిగుమతుల్లో తగ్గుదల నెలకొనడం వల్ల దేశీయంగా వాణిజ్య లోటును 118 బిలియన్ డాలర్లకు చేర్చి జీడీపీ వృద్ధిరేటుకు సమం చేసేందుకు వీలైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతకు క్రితం ఏడాది ఈలోటు 148.23గా ఉండేది. గడచిన జూలై మాసం నుంచే బంగారం దిగుమతుల వృద్ధిలో లోటు నమోదైంది. అయితే గడచిన అక్టోబర్, నవంబర్ మాసాల్లో తిరిగి దిగుమతుల శాతంలో వృద్ధి నెలకొంది. కాగా బంగారాన్ని అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్న భారత్ అగ్రగామిగా ఉంది. ఇందుకు దేశంలోని జువలరీ పరిశ్రమలో నెలకొన్న డిమాండే కారణమన్న సంగతి తెలిసిందే. విలువ ప్రాతిపదికన దేశీయ బంగారం దిగుమతులు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకు ఉంటున్నాయి. ఈక్రమంలో దిగుమతులపై నెలకొన్న ప్రతికూలతలను, సీఏడీ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం జరిగింది.
దీంతో ఈ రంగంలో తయారీ విభాగంలోని వాణిజ్య మూలాలను సంబంధిత యాజమాన్యాలు పొరుగు దేశాలకు తరలించాయ ని విశే్లషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ర త్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) 4 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
6.4 శాతం తగ్గిన
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు
గడచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రత్నా లు, ఆభరణాల ఎగుమతులు 4 శాతం తగ్గాయని సంబంధిత ఎగుమతుల మండలి తెలిపింది. ఈ కాలంలో 27.9 బిలియన్ డాలర్ల విలువైన బంగా రం ఎగుమతులు జరిగాయని వివరించింది. 2018-19లో విలువ ప్రాతిపదికన దేశీయ బంగా రం దిగుమతులు 3 శాతం తగ్గి 3.8 బిలియన్ డాల ర్ల మేర జరిగాయి. ఈక్రమంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సీఏడీ 0.9 శాతానికి చేరి సమానమైందని రిజర్వు బ్యాంకు గణాంకాలు తెలిపాయి.