బిజినెస్

అధిక భారం లేకుండా జిఎస్‌టిపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: ప్రజలపై అధికంగా పన్నులభారం మోపకుండా జిఎస్‌టిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జిఎస్‌టి బిల్లు, పెండింగ్‌లో ఉన్న ఆర్థికశాఖకు సంబంధించిన అంశాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సిమెంట్ ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో ఢిల్లీలో జిఎస్‌టి బిల్లుపై రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఏపి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఒకే పన్ను విధానం అమలులోకి రానున్నందున ఎంతశాతం విధించాలనే విషయమై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు. సుబ్రహ్మణ్యం కమిటీ ఇప్పటికే 18 శాతం సిఫార్సు చేసిందని, జాతీయ ఆర్థిక సొసైటీ 20శాతం ప్రతిపాదించిందని, వీలైనంత తక్కువ పన్నులు వేయటమే శ్రేయస్కరమనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రానికి సుమారు రు. 4500 కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. జిఎస్‌టి బిల్లులో పొందుపరిచిన విధంగా ఐదేళ్ల పాటు వచ్చే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి జిఎస్‌టి అమలుకావాలంటే బిల్లులో పొందుపరిచిన విధంగా జిఎస్‌టి, స్టేట్ జిఎస్‌టి, ఇంటిగ్రేటేడ్ జిఎస్‌టి, లా బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందన్నారు. అన్నింటిపై కూలంకషంగా చర్చించిన అనంతరం కేంద్రం విధి విధానాలను రూపొందిస్తుందని వివరించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సచివాలయంలో జరిగిన సమావేశంలో చర్చించారు. రాష్ట్రం మొత్తంగా 26వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించి అధికారులు, ఎన్జీవో నాయకులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేశారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి యనమల హామీ ఇచ్చారు. క్రమబద్ధీకరణ విషయంలో సుప్రీంకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. సుప్రీం ఆదేశానుసారం న్యాయనిపుణుల సలహాలు తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణరంగం ఊపందుకోవటంతో పాటు రాజధాని నేపథ్యంలో సిమెంట్ ధరలు పెరుగుదలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. త్వరలో బిల్డర్లు, సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ధరల నియంత్రణపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

చిత్రం.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడు