బిజినెస్

రూ. 32 వేల కోట్లు పెరిగిన 7 కంపెనీల విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత వారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగియగా, టాప్ 10 కంపెనీల్లో ఏడు కంపెనీల మార్కెట్ విలువ 32,020 కోట్ల రూపాయల మేర పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాభపడిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. మార్కెట్ ర్యాలీ కొనసాగిన నేపథ్యంలో ఈ కంపెనీలు లాభాలను ఆర్జించగా అందుకు విరుద్ధంగా ఇన్ఫోసిస్, ఎస్‌బీసీ, ఐటీసీ నష్టాలను చవిచూశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ గత వారం 8,270.31 కోట్లు పెరగడంతో 7,02,812.11 కోట్ల రూపాయలకు చేరింది. రిల్ మార్కెట్ విలువ 6,524.47 కోట్ల రూపాయలు పెరగడంతో 9,81,118.53 కోట్లుగా నమోదైంది. హెచ్‌యూఎల్ విలువ 5,412.03 కోట్లు రూపాయలు పెరిగింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 4,22,950.16 కోట్ల రూపాయలకు చేరింది. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ 5,092.83 కోట్ల రూపాయలు పెరగడంతో 3,21,856.51 కోట్ల రూపాయలకు చేరింది. టీసీఎస్ 5,046.96 కోట్ల రూపాయలు పెరిగి 8,30,721.69 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 985.65 కోట్ల రూపాయలు మెరుగుపడి 3,49,517.89 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ 587.87 కోట్ల రూపాయల మేర లాభపడడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 4,25,020.05 కోట్ల రూపాయలకు చేరింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారీ నికర లాభాలను ఆర్జించినప్పటికీ ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 3,336.45 కోట్ల రూపాయలు తగ్గడంతో 3,14,393.82 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఎస్‌బీఐ విలువ 1,338.69 కోట్ల రూపాయలు పతనం కావడంతో 2,96,520.22 కోట్ల రూపాయలకు చేరింది. ఐటీసీ 553.10 కోట్ల రూపాయలు నష్టపోవడంతో దాని విలువ 2,92,528.79 కోట్లుగా నిలిచింది. ర్యాంకింగ్ విషయానికొస్తే టాప్-10 జాబితాలో రిల్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీం ద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐటీసీ ఉన్నాయి. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో సెనె్సక్స్ 135.11 పాయింట్లు పెరిగింది.