బిజినెస్

మార్కెట్లలో బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం బుల్ రన్ కొనసాగింది. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లపై దృష్టి కేంద్రీకరించడంతో, బాంబే స్టాక్ ఏక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లాభాల్లో నడిచాయి. బీఎస్‌ఈలో లావాదేవీలు ప్రారంభమైన వెంటనే మొదలైన కొనుగోళ్ల పరుగు చివరి వరకూ కొనసాగింది. ఇరాన్, అమెరికా మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయే సూచనలు కనిపించడంతో, విదేశీ మదుపరులు వివిధ కంపెనీల వాటాల కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీనితో ఎక్కడా ఆటంకాలు లేకుండా బుల్ రన్ కొనసాగింది. సెనె్సక్స్ ఏకంగా 634.61 పాయింట్లు (1.55 శాతం) పెరిగి, 41,452.35 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌సీఏలో నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. 190.55 పాయింట్లు (1.58 శాతం) పెరగడంతో నిఫ్టీ 12,215.90 పాయింట్లకు చేరింది. ఇరాన్‌తో సయోధ్యకు సిద్ధమని, తాము శాంతిని కోరుకుంటున్నామేగానీ యుద్ధాన్ని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ కూడా మరోసారి క్షిపణి దాడులకు దిగకపోవడం వంటి అంశాలు మదుపరుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ప్రత్యేకించి విదేశీ పెట్టుబడిదారులు షేర్ల కొనుగోళ్లను కొనసాగించారు. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఇరాన్ కీలక సైనికాధికారి ఖాసిం సులేమానీ హతమైన తర్వాత, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. బుధవారం అమెరికా నేతృత్వం వహిస్తున్న సంకీర్ణ దళాల సైనిక శిబిరాలపై ఇరాన్ 22 క్షిపణులను ప్రయోగించడం, మరిన్ని దాడులకు సిద్ధమని ప్రకటించడం సుమస్యను మరింత సంక్లిష్టంగా మార్చాయి. సులేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పార్లమెంటు ముక్త కంఠంతో ప్రకటించిన నేపథ్యంలో, యుద్ధం అనివార్యమన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతి స్థాపనే తమ లక్ష్యమని ట్రంప్ చేసిన ప్రకటనతో వాతావరణం కొంత చల్లబడింది. ఇరాన్ కూడా ప్రతికార దాడును కొనసాగించలేదు. ఫలితంగా విదేశీ మదుపరులు మళ్లీ ఉత్సాహంగా ట్రేడింగ్‌లో పాల్గొన్నారు.
చైనా ఉప ప్రధాని లియూ హీ వచ్చే వారం అమెరికాలో పర్యటించి, ఎంతోకాలంగా ప్రపంచమంతా వేచి చూస్తున్న వాణిజ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు వచ్చిన వార్త కూడా ప్రపంచ స్టాక్ మార్కెట్ల ఊతానికి కారణమైంది. భారత మార్కెట్లపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా ఆటుపోట్లకు తెరపడింది. రోజు మొత్తం ట్రేడింగ్ లాభాల్లోనే నడించింది. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలు అత్యధికంగా 3.80 శాతం లాభాలను ఆర్జించాయి. ఎస్‌బీఐ 3.25 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 3.14 శాతం, ఇండస్‌ఇండ్ 3 శాతం, మారుతీ సుజికీ 2.76 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, మార్కెట్ ధోరణులు సానుకూలంగా ఉన్నప్పటికీ, టీసీఎస్ 1.73 శాతం నష్టపోయింది. హెచ్‌సీఎల్ టెక్ (0.95 శాతం), ఎన్‌టీపీసీ (0.25 శాతం), సన్ ఫార్మా (0.07 శాతం) వాటాలు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలోనూ గురువారం లావాదేవీలు లాభాల్లో కొనసాగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు 5.90 శాతం లాభాలను సంపాదించాయి. భారతీ ఎయిర్‌టెల్ 5.44 శాతం, టాటా మోటోకార్ప్ 5.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.74 శాతం, ఇండస్‌ఇండ్ 3.37 శాతం లాభాలను నమోదు చేశాయి. కాగా బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ టీసీఎస్ నష్టపోయిన కంపెనీల జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ కంపెనీ షేర్ల ధర 1.56 శాతం పతనమైంది. కోల్ ఇండియా 1.12 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.82 శాతం, బ్రిటానియా 0.62 శాతం, గెయిల్ 0.36 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.