బిజినెస్

ఐటీ విస్తరణకు బీజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 7: హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా గుర్తింపు ఉన్న వరంగల్‌లో ఐటీ విస్తరణకు బీజం పడిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ నగర శివారులోని మడికొండ ఐటీ సెజ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా ఐటీ ఇంక్యూబేటర్‌ను, సైయింటు ఐటీ సెజ్ శిలాఫలకం, భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ విస్తరణలో భాగంగా వరంగల్ నగరానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణీ నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాదిలో ద్వితీయ నగరాలైన కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండలో ఐటీ రంగాన్ని విస్తరింపచేస్తామని ఆయన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. వరంగల్‌లో ఐటీ రంగం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు వీలుగా రవాణా రంగాన్ని కూడా మెరుగుపర్చాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటూనే త్వరలోనే హైదరాబాద్ నుండి వరంగల్‌కు హెలీపోర్టు సర్వీసులను ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న స్కై బ్రిడ్జీలతో వరంగల్-హైదరాబాద్ రవాణా మార్గం మరింత మెరుగుపడుతుందని అన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు పెట్టుబడులు పెట్టేందుకు కొరియా దేశం నుండి వస్తున్నారని అన్నారు. దీని ద్వారా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయని అన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వరంగల్ నగరాన్ని ఐటీ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ త్వరలోనే అభివృద్ధి జరగనుందని దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. వరంగల్‌లో మానవ వనరుల నైపుణ్యం పుష్కలంగా ఉందని మంత్రి అన్నారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు కాబోతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే రెండవ హరితవిప్లవం రాబోతుందని అన్నారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, సాగు, తాగునీటి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశానికి ఆదర్శంగా నిలువబోతుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టబడులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నామని వెల్లడించారు. వేలాదిగా రానున్న ఉద్యోగ అవకాశాలలో సింహభాగం మన పిల్లలకే ఉద్యోగాలు దక్కలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఈచ్ వన్, టీచ్ వన్ నినాదంతో విద్యార్ధులలో నైపుణ్యాన్ని పెంపొందించాలని దీని కోసం ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌లో ఐటీ సెంటర్‌ను ప్రారంభించి పదివేల మంది గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈవో గురునాని, సైయింట్ ఎండీ నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...వరంగల్‌లో టెక్ మహీంద్రా ఐటీ కంపెనీని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్