బిజినెస్

భారీగా పెట్రో వడ్డన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ఫలితంగా చమరు రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. భారత్‌లో సోమవారం నుంచి పెట్రోలు రేటును లీటరుకు 15 పైసలు చొప్పున, డీజిల్ లీటరు 17 పైసలు చొప్పున కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారల్‌కు 70 డాలర్లు చేరుకోవడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు తాజా రేటు ప్రకారం 75.69 పైసలు. 2018 నవంబర్ నుంచి ఇంతవరకు పెట్రోలు లీటరు రేటు ఇంతగా లేదు. అలాగే డీజిల్ రేటు కూడా లీటరుకు 68.68 పైసలకు పెరిగింది.
భారతదేశ చమురు అవసరాలు 84 శాతం మేర దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఏమాత్రం పెరిగినా దాని ప్రభావం నేరుగా భారత్ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. కాగా, చమురు సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడే ఎలాంటి సమస్య ఉండబోదని, అయితే ధరలను పెంచడం అనివార్యంగా మారిందని అధికారులు స్పష్టం చేశారు.