బిజినెస్

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్)పై ఒత్తిడి మరింతగా పెరుగుతున్నది. తమతమ క్లెయిమ్స్‌ను వెంటనే చెల్లించాలని ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులు పట్టుబడుతున్నారు. యూపీ పవర్ కార్పోరేషన్ (యూపీపీసీ)కు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఈ కంపెనీలో ఫిక్స్ డిపాజిట్స్ ఉంచారు. వీరితోసహా మొత్తం సుమారు 55 వేల మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులు 4,800 కోట్ల రూపాయల విలువైన క్లెయిమ్స్ కోసం చేసుకున్న దరఖాస్తులను మధ్యవర్తిత్వ బృందం పరిశీలనకు స్వీకరించింది. వీరితోపాటు, ఇతర రుణదాతలకు కంపెనీ ఇవ్వాల్సిన మొత్తం 93,105 కోట్ల రూపాయలు. ఆస్తులు మాత్రం 85,800 కోట్ల రూపాయలు. ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) విచారణలో ఉన్న ఈ కేసులో త్వరలోనే తీర్పు వెలువడుతుందని అంటున్నారు. కంపెనీ ఆస్తులన్నింటినీ ఆమ్మితే, రుణదాతలందరికీ దామాషా ప్రకారం చెల్లింపులు జరుపుతారు.