బిజినెస్

అమల్లోకి వచ్చిన పెరిగిన రైల్వే చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: డీజిల్, ఇతర ముడిసరుకుల ధరలు పెరగడంతో రైల్వే చార్జీలు స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ (హైదరాబాద్) నుంచి వివిధ ప్రాంతలకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో పెరిగిన చార్జీల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లల్లో చార్జీలను పాత పద్దతినే అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్- న్యూఢిల్లీ వెళ్లే రైళ్లల్లో మొదటి తరగతి ఏసీ రూ.75/ రెండవ, మూడవ తరగతి ఏసీకి రూ. 70 రూపాయలు పెంచారు.. అలాగే, స్లీపర్‌కు రూ.30/ జనరల్ బోగీలకు రూ.25 రూపాయలు పెంచారు. హైదరాబాద్- త్రివేండ్రం మధ్య నడిచే రైళ్లల్లో మొదటి తరగతి ఏసీలో మార్పులేదు. రెండు, మూడు తరగతిలో ఏసీలో రూ. 65 రూపాయలు పెరిగింది. స్లీపర్, జనరల్ బోగీల్లో 30/25 పెరిగింది. హైదరాబాద్- హౌరా (కోల్‌కత్తా) మధ్య నడిచే రైళ్లల్లో అన్ని రకాల ఏసీలో రూ. 65 రూపాయలు పెంచారు. స్లీపర్/ జనరల్ బోగీల్లో 35/30 రూపాయలు పెంచారు. హైదరాబాద్ - ముంబయ మధ్య నడిచే రైళ్లలో మొదటి తరగతి ఏసీలో ఏలాంటి మార్పు లేదు.
రెండు, మూడు తరగతి ఏసీల్లో రూ.35 రూపాయలు పెంచారు. స్లీపర్ /జనరల్ బోగీల్లో 20/15 రూపాయలు పెంచారు. హైదరాబాద్ - షిర్డీ మధ్య నడిచే రైళ్లల్లో అన్ని తరగతుల ఏసీలపై రూ.35 పెంచారు. స్లీపర్/ జనరల్ బోగీల్లో 20 నుంచి 15 రూపాయలు పెరిగింది. కాచిగూడ- మైసూర్ మధ్య నడిచే రైళ్లలో అన్ని రైళ్లల్లో ఏసీకి 35 రూపాయలు, స్లీపర్/జనరల్ బోగీల్లో 20/15 రూపాయలు పెంచారు. హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే రైల్లల్లో అన్ని ఏసీ తరగతుల్లో రూ.30/ స్లీపర్/ జనరల్ బోగీల్లో రూ. 15/15 పెరిగింది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే రైళ్లల్లో మొదటి, రెండవ తరగతి ఏసీకి రూ.30, మూడవ తరగతి ఏసీకి 25, స్లీపర్/ జనరల్ బోగీల్లో రూ. 15/15 రూపాయలు పెరిగింది. సికింద్రాబాద్ - షిర్డీ (మన్మాడ్) మధ్య నడిచే రైళ్లల్లో మొదటి ఏసీ 30/ రెండవ, మూడవ ఏసీలో రూ.25/ స్లీపర్/ జనరల్ బోగీల్లో రూ.15 పెంచారు. హైదరాబాద్- నర్సాపూర్ మధ్య నడిచే రైళ్లల్లో అన్ని ఏసీ కోచ్‌ల్లో రూ. 20. స్లీపర్/జనరల్ బోగీల్లో రూ.10/10 పెంచామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.