బిజినెస్

ఐపీఓ ద్వారా రూ. 1000 కోట్ల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా రూ. 1000 కోట్లు సమీకరించాలని ‘అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్స్’ యా జమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోసం ఆ సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్‌తో కూడిన దరఖాస్తు అందజేసింది. ఈ ఐపీఓలో రూ. 400 కోట్ల తాజా ఇస్యూతోబాటు మరో రూ. 600 కోట్ల విలువైన ‘ఆఫర్ ఫర్ సేల్’ (ఓఎఫ్‌ఎస్) ఇస్యూ ఉన్నాయి. ఓఏఫ్‌ఎస్ ద్వారా సమీకరిం చే మొత్తంలో రూ. 125 కోట్లు ప్రమోటర్ విక్రయ వాటాలుగా, రూ. 354.9 కోట్లు అపీజయ్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాలుగా, మరో రూ. 84.7 కోట్లు అపీజయ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాలుగా (పెట్టుబడిదారుల విక్రయ వాటాలు) ఉన్నాయి. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఇలా సమీకరించే నిధులను జనరల్ కార్పొరేట్ విధానంలోని ముందస్తు లేదా తిరిగి చెల్లించాల్సిన వాటికి ప్రధానంగా కంపెనీ వినియోగిస్తుంది. ఈ కంపెనీ వాటాలను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టెడ్‌గా మా ర్చేందుకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఈ కంపెనీకి శాఖలున్నాయి. ‘లగ్జరీ బౌటిక్ హోటల్’ పేరిట దేశంలో ‘ది పార్క్’ బ్రాండ్ ద్వారా ఈ కం పెనీ హోటల్ రంగంలో ప్రత్యేకతను చాటుతోంది.
అలాగే షిప్పింగ్, తేయాకు, స్థిరాస్తి వ్యాపారాలతోబాటు ఆక్సఫర్డ్ బుక్‌స్టోర్స్ వంటి రీటెయిల్ బ్రాండ్ల వాణిజ్యం, విద్యారంగంలోనూ ఈ సంస్థ తన వ్యాపార విస్తరణ చేసింది.