బిజినెస్

ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా.. ఎన్డీయే అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశాన్ని 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేసేందుకు 102 లక్షల కోట్ల జాతీయ వౌలిక సదుపాయాల పెట్టుబడుల పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంధనం, రైల్వే, పట్టణ, రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. (నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్) నిప్‌గా నామకరణం చేసిన ఈ పథకం పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగంతో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2019-20 నుండి 2024-25 మధ్య దేశంలో జాతీయ వౌలిక సదుపాయాల వ్యవస్థను వంద లక్షల కోట్ల పెట్టుబడితో సృష్టించేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని సిఫారసు చేసేందుకు మోదీ ప్రభుత్వం ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ టాస్క్ఫోర్సు ఇచ్చిన నివేదికలో చేసిన సిఫారసుల మేరకు 102 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన జాతీయ వౌలిక సదుపాయాల వ్యవస్థను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ ఈరోజు టాస్క్ఫోర్సు నివేదికను విడుదల చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్సు.. నివేదికను ఈరోజు నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను వౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఖర్చు చేయవలసి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు వౌలిక సదుపాయాల కొరత అడ్డంకి కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక వౌలిక సదుపాయాల పెట్టుబడుల ప్రణాళికను రూపొందించవలసి ఉంది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు టాస్క్ఫోర్సు చేసిన సిఫారసులపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు రానున్న ఐదు సంవత్సరాల్లో వౌలిక సదుపాయాల కల్పనతోపాటు సామాజిక, ఆర్థిక వౌలిక సదుపాయాల పథకాల కోసం వంద లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 2019 స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సంధర్భంగా ప్రకటించటం తెలిసిందే. దేశంలో వౌలిక సదుపాయాలను పెంచేందుకు 2020-25 ఆర్థిక సంవత్సరాల్లో 102 లక్షల కోట్లలో దాదాపు 70 శాతం నిధులను ఇంధనం, రోడ్లు, పట్టణ, రైల్వే రంగాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించనున్నారు. ఈ 70 శాతం నిధుల్లో ఇంధన రంగానికి 24 శాతం, రోడ్ల అభివృద్ది, విస్తరణకు 19 శాతం, పట్టణాభివృద్ధికి 16 శాతం, రైల్వేల అభివృద్దికి 13 శాతం నిధులను ఖర్చు చేసే అవకాశాలున్నాయి. 102 లక్షల కోట్ల పథకానికి అదనంగా మరో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను కూడా జత చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
'చిత్రం... మాట్లాడుతున్నఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్