బిజినెస్

తొలి త్రైమాసికంలో మిగులుకు కరెంట్‌ఖాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా మిగులులో ఉండవచ్చని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూపు అభిప్రాయ పడింది. వాణిజ్య లోటు దిగువ స్థాయిలో స్థిరపడుతోందని, ఆగస్టు నెల వాణిజ్య లోటును కూడా కలిపి చూసినట్లయితే కరెంట్ ఖాతా విషయంలో స్థూలంగా సమతుల్యతతో ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయ పడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 0.4 బిలియన్ డాలర్లు లేదా జిడిపిలో మైనస్ 0.1 శాతం ఉన్న దృష్ట్యా చూసినట్లయితే ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కరెంట్ కాతా 2 బిలియన్ డాలర్ల మిగులు లేదా జిడిపిలో 0.4 శాతంగా ఉండవచ్చని సిటీ గ్రూపు ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. మన దేశ వాణిజ్య లోటు ఆగస్టు నెలలో 7.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతేకాదు గత మూడు నెలలుగా ఎలాంటి మార్పూ లేకుండా కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే గత ఆర్థిక సంవత్సరం సగటు నెలవారీ వాణిజ్య లోటయిన 9.9 బిలియన్ డాలర్లకన్నా కూడా తక్కువగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో దిగుమతులు 14 వాతం తగ్గి 29.2 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎగుమతులు కేవలం 0.3 శాతం మాత్రమే తగ్గి 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.