బిజినెస్

రూ.450 కోట్ల పెట్టుబడితో చక్కెర శుద్ధి కర్మాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 12: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో చక్కెర శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు టొయోటా సుషో సుగర్ ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థ ఆసక్తి కనబరచింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చెరకు సంబంధిత వాణిజ్యంలో లండన్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 450 కోట్లతో చక్కెర శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రికి టిటిఎస్‌టి సంస్థ సిఇఓ హిరోయుకి ఇకెడ తెలిపారు. రోజుకు మూడు వేల టన్నుల చక్కెర రిఫైనరీ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలియచేశారు. ఏడాదికి రెండు లక్షల మెట్రిక్ మిలియన్ టన్నుల వాణిజ్యం జరపాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. టొయోటా సుషో సుగర్ ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థలో ప్రసిద్ధ టొయోటా కార్పొరేషన్ 21.7 శాతం వాటా కలిగి ఉంది. భారత దేశంతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ముడి చక్కెరను శుద్ధి చేసి నాణ్యమైన చక్కెరను అందిస్తామని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ చక్కెర నెస్ట్లీ, క్యాడ్‌బరీ, కొకోకొలా, పెస్సీ తదితర కంపెనీల ప్రమాణలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేస్తామని ఆయన తెలియచేశారు. ఈ సమావేశంలో సంస్థకు చెందిన సుగర్ ట్రేడింగ్ డైరక్టర్ ఓ కొన్నర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. టయోటా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు