బిజినెస్

సెబీకి రూ. 1.23 కోట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఇన్‌సైడర్ వాణిజ్య మార్గదర్శకాలను విస్మరించిన ఓ కేసులో ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (జీఐసీ) రూ. 1.23 కోట్ల మొత్తం మార్కెట్ నియంత్రణ విభాగం సెబీకి శుక్రవారం చెల్లించింది. తద్వారా ఈ కేసును జీఐసీ సెటిల్మెంట్ చేసుకుంది. యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న ఈ కంపెనీ వాటాలపై సెబీ జరిపిన విచారణలో జీఐసీ లొసుగులు వెలుగు చూశాయి. ఈప్రైవేటు బ్యాంకులోని వాటాల విషయంలో జరిగిన మార్పును ఇన్‌సైడర్ వాణిజ్య లొసుగుల నియంత్రణ చట్టం మార్గదర్శకాల మేరకు సవివరంగా వెల్లడంచలేదని విచారణలో సెబీ గుర్తించింది. ఈక్రమంలో గత అక్టోబర్‌లో సెబీ జీఐసీకి సెటిల్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఈకేసును రూ. 1.23 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవాలని సూచించింది. దీంతో సెబీకి సెటిల్మెంట్ దరఖాస్తు చేసుకున్న జీఐసీ తాను అవకతవకలకు పాల్పడిన వియాన్ని అటు అంగీకరించకుండానే తాజాగా రూ. 1.23 చెల్లించింది. ఈ సెటిల్మెంట్‌కు సంబంధించి జీఐసీ వెల్లడించే విషయాల్లో ఏవైనా అసత్యాలున్నట్టు గుర్తిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సివుంటుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) హెచ్చరించిన క్రమంలోనే జీఐసీ దరఖాస్తులో తాను దోషినని కానీ, నిర్దోషిననిగానీ వెల్లడించలేదని తెలుస్తోంది.