బిజినెస్

మార్కెట్లలో అనిశ్చితి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఈవారం భారత్‌పైనా ప్రభావం చూపిం ది. అయితే, భారీ నష్టాల బారిన పడకుండా, స్వల్ప లాభాలతో బయటపడి, ఊపిరి పీల్చుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లో 40,323.61 పాయింట్లతో సోమవారం ప్రారంభమైన సెనె్సక్స్ ఒకానొక దశలో నష్టాల ఊబిలో కూరుకుపోయి, బయటపడే అవకా శం లేదనే అభిప్రాయాన్ని కలిగించింది. అయి తే, చివరిలో దేశీయ మదుపరులు ఆదుకోవడంతో, 21.17 పాయింట్లు మెరుగుపడి, 40,345.08 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా మధ్యాహ్న సమయంలో దారుణంగా నష్టపోయినప్పటికీ, సాయంత్రానికి కోలుకొని, 5.30 పాయింట్ల లాభాన్ని ఆర్జించి, 11,913.45 పాయింట్లుగా నమోదైంది. మంగళవారం గురుపౌర్ణమి కారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. బుధవారం ఇటు బీఎస్‌ఈ, అటు ఎన్‌ఎస్‌ఈ దారుణంగా నష్టపోయాయి. సెనె్సక్స్ ఏకంగా 229.02 పాయింట్లు పతనమై, 40,116.06 పాయింట్లకు పడిపోయింది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా ఉన్నకారణంగా, సూచీలు మరింత పడిపోతాయన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడింది. అయితే, గురువారం మార్కెట్లు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగితే, మన దేశంలోనూ అదే పరిస్థితి కనిపించింది. కానీ, చివరి క్షణాల్లో దేశీయ పెట్టుబడిదారులు ఆదుకోవడంతో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొ ని, 170.42 పాయింట్లు లాభపడిన సెనె్సక్స్ 40,286.48 పాయింట్ల ముగిసింది. నిఫ్టీ 31.65 శాతం లాభపడడంతో 11,872.10 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం కూడా మార్కెట్లు నష్టాల ప్రమాదం నుంచి విజయవంతంగా బయటపడి, స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెనె్సక్స్ 70.21 పా యింట్లు మెరుగుపడడంతో, 40,356.69 పాయింట్లకు చేరింది. 23.35 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 11,895.45 పాయింట్ల వద్ద ముగిసిం ది. మొత్తం మీద స్థూలంగా చూస్తే, ఈవారం సెనె్సక్స్ 33.08 పాయింట్లు లాభాలతో ముగియడం మదుపరులకు ఊరటనిచ్చింది. నిఫ్టీ మాత్రం 12.70 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. భారీ నష్టాలు తప్పవనుకున్న తరుణం లో, ఈ తగ్గుదలను మార్కెట్ విశే్లషకులు సా నుకూల పరిణామంగానే అభివర్ణిస్తున్నారు.