బిజినెస్

రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై ‘ఇర్దాయ్’ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీమా నియంత్రణ సంస్థ ‘ఇర్దాయ్’ గురువారం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఐసీఎల్)పై కొరడా ఝళిపించింది. బలహీన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పాలసీలేవీ ఈ సంస్థ విక్రయించరాదంటూ ఆంక్షలు విధించింది. అలాగే ఆర్‌హెచ్‌ఐసీఎల్‌కు చెందిన పాలసీదార్లకు సంబంధించిన గత లావాదేవీలన్నింటినీ ఆర్థిక ఆస్తుల సహా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ (ఆర్‌జీఐసీఎల్)కు బదలాయించాలని ఇర్దాయ్ ఆదేశించింది. పాలసీదారుల క్లెయిమ్‌లు సక్రమంగా జరగాలంటే ఈ ఆదేశాలు అమలు చేయాలని పేర్కొంది. ఆర్‌జీఐసీఎల్ ప్రకటించిన ఆర్థిక బల నిష్పత్తినిబట్టి ఆ కంపెనీ నిబంధనల స్థాయికన్నా తక్కువ స్థాయిలో ఉందని, అందువల్ల ఆరోగ్య బీమా వాణిజ్యాన్ని తదుపరి కొనసాగించేందుకు వీలు లేదని ఆర్దాయ్ వ్యాఖ్యానించింది. క్లెయిమ్‌లకు చెల్లింపులు చేయడం వంటివి కూడా నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంది. నవంబర్ 15న నియామక తేదీ నుంచి ఆర్‌హెచ్‌ఐసీఎల్ బీమా వ్యాపారాన్ని ఆపాలని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అన్ని శాఖా కార్యాలయాల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ఇర్దాయ్ పేర్కొంది. అలాగే ఆ కంపెనీకి చెందిన ఆస్తులన్నింటికీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తమకు తెలుపకుండా ఎలాంటి ఆస్తి విక్రయాలూ చేపట్టరాదని సైతం ఆదేశించింది. ఆర్‌జీఐసీఎల్ నిజాయితీగా క్లెయిమ్‌లను పరిష్కరించాలని, అవికూడా ఆర్‌హెచ్‌ఐసీ పోర్ట్‌పోలియోకు సంబంధం లేకుండా చేయాలని ఆదేశించింది. కాగా గత ఏడాది ఆక్టోబర్‌లో ఇర్దాయ్ ఆర్‌హెచ్‌ఐసీఎల్‌కు సర్ట్ఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేసింది. ఐతే గత జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి ఆ కంపెనీ ఆర్థిక బలోపేత నిష్పత్తి (సాల్వెన్సీ రేషియో)ను 106 శాతంగా ప్రకటించింది. సాధారణంగా 150 శాతం ఉండాల్సిన ఈ నిష్పత్తికన్నా తక్కువగా నమోదు కావడంతో సాధారణ నియంత్రణ స్థాయికి ఈ నిష్పత్తిని చేర్చాలని ఇర్దాయ్ గత సెప్టెంబర్‌లో కంపెనీని ఆదేశించింది. ఐతే పలు దఫాలుగా హెచ్చరించినా కంపెనీ పెడచెవిన పెట్టిందని ఆదేశాల్లో వ్యాఖ్యానించింది.