బిజినెస్

మాంద్యంలోనూ ‘కిక్కే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను కుదిపేస్తున్నప్పటికీ, మద్యం విక్రయాలపై మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని స్పష్టమైంది. రాష్ట్రంలో రిటేల్ మద్యం షాపుల లైసెన్స్‌ల జారీ కోసం కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. రాష్టవ్య్రాప్తంగా 2,216 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించగా బుధవారం సాయంత్రం గడువు ముగిసేటప్పటికీ సుమారు 43 వేల దరఖాస్తులు అందాయి. వీటిపై తిరిగి చెల్లించని దరఖాస్తుల ఫీజు రూపేణ ప్రభుత్వానికి రూ. 860 కోట్ల ఆదాయం చేకూరింది. అన్ని జిల్లాల నుంచి పూర్తి సమాచారం అందాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కో దరఖాస్తుతో పాటు రూ. 2 లక్షల ఫీజును ప్రభుత్వం వసూలు చేసింది. మద్యం రిటేల్ షాపుల లైసెన్స్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను లాటరీ ద్వారా శుక్రవారం ఎంపిక చేస్తారు. లాటరీలో దుకాణం లభించినా, లభించకున్నా ఈ మొత్తాన్ని మాత్రం ప్రభుత్వం తిరిగి చెల్లించదు. దీంతో దరఖాస్తుల రూపేణ వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానాలోనే జమ కానుంది. రెండు సంవత్సరాల కాలపరిమితికి 2017-19 మద్యం షాపుల దరఖాస్తులకు ఫీజు రూపేణ ప్రభుత్వానికి రూ.412.60 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు దరఖాస్తు ఫీజు రూ. లక్ష మాత్రమే ఉండగా ఈ దఫా దీనిని రూ. 2 లక్షలకు పెంచింది. ప్రస్తుతం జారీ చేయనున్న మద్యం లైసెన్స్‌లకు కాలపరిమితి నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 30, 2020 వరకు చెల్లుబాటు అవుతుంది. మద్యం షాపుల నిర్వహణపై కఠిన నిబంధనలతో విధి విధానాలను ఎక్సైజు శాఖ బుధవారం జారీ చేసింది. ప్రతి మద్యం షాపులో 3 సీసీ టీవీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఎక్సైజు శాఖ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మద్యం బాటిల్స్‌పై ముద్రించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మార్పి కంటే ఎక్కువగానీ, తక్కువగానీ విక్రయిస్తే సదరు షాపు యజమానికి 6 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అపరాధ జరిమాన వసూలు చేయనున్నట్టు నిబంధనలలో పేర్కొన్నారు. ఇలా ఉండగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించగా మంగళవారం వరకు 30 వేల దరఖాస్తులు అందగా, చివరి రోజైన బుధవారం ఒక్కరోజే 13 వేలపై చిలుకు దరఖాస్తులు అందాయి. గడువు ము గిసిన బుధవారం సాయంత్రం 4గంటల వరకు క్యూలో నిలుచు న్న దరఖాస్తులను మాత్రమే అనుమతించారు. చివరి రోజున మ ద్యం షాపులకు దరఖాస్తులు చేయడానికి వచ్చిన వందలాది వాహనాలు, వేలాది మందితో కేంద్రాలు కిక్కిరిపోయాయి. మ ద్యం షాపుల దరఖాల స్వీకరణ కేంద్రాల వద్ద ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.