బిజినెస్

మొబైల్ సేవల ధరలు మరింత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రస్తుత మొబైల్ సేవల ధరలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని టెలికాం ఆపరేటర్ ‘్భరతీ ఎయిర్‌టెల్’ మంగళవారం నాడిక్కడ పేర్కొంది. ప్రస్తుత ధరలు కంపెనీల స్థిరమైన వృద్ధికి తోడ్పడేవిగా లేవని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, భారత, దక్షిణాసియా దేశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ తెలిపారు. రిలయన్స్ జియో సంస్థ ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6పైసల వంతున చార్జి చేసేందుకు నిర్ణయించడాన్ని ఆయన ఈ సందర్భంగా స్వాగతించారు. ఇంటర్ కనెక్షన్ వినియోగ చార్జీలు టారిఫ్‌లో భాగం కానప్పటికీ దీనివల్ల ఆపరేటర్ల మధ్య ట్రాన్స్‌మిట్ కాల్స్‌కు సంబంధించిన చార్జీలు క్లియర్ కావడానికి వీలు కలుగుతుందన్నారు. ఏదేమైనప్పటికీ నిమిషానికి ఆరుపైసల వంతున వసూలు చేసే మొత్తాన్ని వినియోగదారులకు దానికి సమానమైన ఉచిత డేటాను కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని జియోప్రకటించడం జరిగింది. ఐతే మొబైల్ సేవల ధరలు ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ ఎండీ విట్టల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ‘ఐయూసీ’ చేయగలిగిందేమీ లేదని, ఇది సంస్థల మధ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన ద్వై పాక్షిక వ్యవహారమని ఆయన తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి ఐయూసీ పూర్తిగా ఇంకిపోయిన వ్యవహారంగా మారిందని వ్యాఖ్యానించారాయన. వచ్చే రౌండ్‌కు ప్రతిపాదించిన స్పెక్ట్రం ధరలు సైతం 5జీ వ్యాపారం సక్రమంగా నడిచే స్థాయిలో లేవని విట్ట ల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజయవంతం కావాలంటే టెలికాం పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాలని, ఆరోగ్యకర పోటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ పరిశ్రమకు తగినంతగా పెట్టుబడులు రాకపోతే ఏ లక్ష్యాలూ సాధ్యం కావన్నారు. గత ఐదేళ్లుగా ఈ పరిశ్రమకు పెట్టుబడులు తగ్గిపోయాయని, వచ్చే ఐదేళ్లలో ఆ లోటును పూడ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అంటే మదుపర్లకు పెట్టుబడులపై తగినంతగా లాభాలు వచ్చేలా చూడాలన్నారు.