బిజినెస్

భారత భూభాగంలో భారీగా సహజ వాయువు నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్‌లో ఇప్పటికీ కనుగొనాల్సిన సహజవాయు నిల్వలు దాదాపు 100 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు ఉన్నాయని ఇంగ్లాండ్‌కు చెందిన దిగ్గజ బీపీ పీఎల్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డుడ్లే వెల్లడించారు. ఈ నిల్వలను వెలికితీస్తే 2050 వరకు దేశానికి అవసరమైన మొత్తం సహజవాయులో సగం దేశీయంగానే సమకూరుతుందని తెలిపారు. ‘ఇండియా ఎనర్జీ ఫోరం ఆఫ్ సిరావీక్’ కార్యక్రమంలో సోమవారం నాడిక్కడ ఆయన పాల్గొని ప్రసంగించారు. రియన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బీపీ 5 బిలియన్ డాలర్లు పెట్టుబడుల ద్వారా రోజుకు బిలియన్ కూబిక్ అడుగుల సహజవాయును వెలికితీసేందుకు రంగం సిద్ధం చేసిందని, ఈ ప్రక్రియ 2020 ద్వితీయార్ధం నుంచి మొదలవుతుందని ఆయన డుడ్లే వివరించారు. అలాగే తమ కంపెనీ ఇంధన రీటెయిల్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు భాగస్వామ్యాన్ని విస్తరిస్తోందన్నారు. ఇందుకు సంబంధించి ఆర్‌ఐఎల్‌కు ప్రస్తుత నెట్‌వర్క్ 1,400 పెట్రోల్ పంపులున్నాయని, వీటిని 2023 నాటికి 5,500కు పెంచాలన్న లక్ష్యం ఉందని తెలిపారు. ఈపంప్‌లు ఒకవైపుపెట్రోలు, డీజిల్ రీటెయిల్ వ్యాపారం సాగిస్తూ మరోవైపు విద్యుత్ వాహనాల చార్జింగ్‌ను సైతం నిర్వహిస్తాయని వెల్లడించారు. సహజవాయు వనరులతోబాటు భారత్‌కు సంప్రదాయేతర ఇంధన వనరులు సైతం పుష్కలంగా ఉన్నాయని, ఇది ప్రకృతి ఇచ్చిన వరమని డుడ్లే పేర్కొన్నారు. భారత్ భూగర్భంలో ఇంకా 100 టీసీఎల్ సహజవాయు నిల్వలున్నాయని తాను నమ్ముతున్నానని, ఐతే ఇలాంటి నిల్వలు వెలికితీత ఆషామాషీ కాదని, అందుకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలని, ఇలాంటి వనరులను వినియోగించుకోవడం ద్వారా ఏదేశమైనా ఆర్థిక ప్రగతిని సాధిస్తుందని ఆయన అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ వనరుల వెలికితీత అత్యంత ఖర్చుతో కూడుకున్న అంశమన్నారు. బొగ్గును సహజవాయువుతో కలిపి వాడడం ద్వారా వ్యర్థాలను నివారించవచ్చని ఇలా ఇంధన వినియోగానికి సంబంధించిన అన్ని అవకాశాలనూ భారత్ వాడుకోవాలని ఆయన సూచించారు.