బిజినెస్

లాభాల బాటలోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజు మళ్లీ కోలుకున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరమైన సయోధ్య కుదిరే అవకాశాలున్నాయన్న కథనాలతో బాటు చైనా దేశాధినేత భారత పర్యటన నేపథ్యంలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు భారత్-చైనా మధ్య కుదిరే వీలుందన్న అంచనాలతో శుక్రవారం మదుపర్లు వాటాల కొనుగోళ్లకు దిగారు. ఈక్రమంలో తొలుత ఏకంగా 600 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైంది. చివరిగా 246.68 పాయింట్ల ఆధిక్యతతో 0.65 శాతం లాభాలతో 38,127.08 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 66.70 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 11,301.25 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. కాగా ఒక రోజు సెలవుతో కూడిన ఈ వాణిజ్య వారంలో సెనె్సక్స్ 453.77 పాయింట్లు (1.20 శాతం) లాభపడగా, నిఫ్టీ 126.50 పాయింట్లు (1.13 శాతం) లాభపడింది. ఇలావుండగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పరిష్కారం విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించదలిచామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు శుక్రవారం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేశాయి. ‘ఇప్పుడే చైనాతో మా చర్చలు ముగిశాయి. సానుకూలంగానే సాగుతున్నాయి. రేపుమరో సమావేశం ఉంది. నేను దీనిపై వైట్ హౌస్‌లో వైస్ ప్రీమియర్‌తో చర్చించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటా’నన్న ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, దేశీయంగా మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావాన్ని చూపాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కాగా శుక్రవారం సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 4.9 శాతం ఇన్ఫోసిస్ లాభపడింది. ఆ సంస్థ సానుకూల త్రైమాసిక ఫలితాలే ఇందుకు కారణం. అలాగే వేదాంత, టాటామోటార్స్, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్ సైతం 3.96 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు యెస్‌బ్యాంక్, ఎం అండ్ ఎం, ఆర్‌ఐఎల్, టీసీఎస్, హీరోమోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ 3.30 శాతం నష్టపోయాయి. కాగా ఫైనాన్స్ రంగంలో రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశాలు లేవన్న అంచనాలు ఓవైపు మార్కెట్లకు ప్రతికూలంగా ఉన్నా అంతర్జాతీయ సానుకూలతలదే పైచేయి అయిందని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన ప్రముఖ విశే్లషకుడు సంజీవ్ జర్బడే తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ, ఐటీ, టెక్, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, వాహన, ఫైనాన్స్, పారిశ్రామిక సూచీలు 2.44 శాతం లాభపడ్డాయి. ఇక చమురు, సహజవాయులు, ఇంధనం, వినిమయ వస్తువుల రంగాలు 0.41 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో స్మాల్ అండ్ మీడ్‌క్యాప్ సూచీలు బెంచ్‌మార్కుకన్నా తక్కువ 0.38శాతాన్ని నమోదు చేశాయి. కాగా మార్కెట్ వేళల తర్వాత త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన టీసీఎస్ సెప్టెంబర్‌తో ముగిసిన మూడునెల్ల కాలంలో రూ. 8,042 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలిపింది. తనకు భవిష్యత్తులో పలు సవాళ్లు ఎదురవుతాయని సైతం ఆ కంపెనీ అంచనా వేసింది. అలాగే ఇన్ఫోసిస్ తన రెండోత్రైమాసిక నికర లాభాల్లో 2.2 శాతం తగ్గినట్టు ప్రకటించింది. మొత్తం రూ. 4,019 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా ఖండ మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ శుక్రవారం లాభాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో సానుకూలంగా సాగాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా పెరిగి 71.03గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 1.79 శాతం పెరిగి బ్యారెల్ 60.16 డాలర్ల వంతున ట్రేడైంది.