బిజినెస్

ప్రైవేటుకు రైళ్ల నిర్వహణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 150 రైళ్లను, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడానికి చర్యలు ప్రారంభించింది. దీనికోసం ఒక బ్లూప్రింట్‌ను తయారు చేసేందుకు ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించే ప్రక్రియను నిర్వహించడానికి ఒక సాధికారిక బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అమితాబ్ కాంత్ ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సాధికారిక కమిటీలో యాదవ్, కాంత్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. రైల్వేలు 400 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దవలసి ఉండగా, ఇప్పటి వరకు చాలా కొన్నింటిని మాత్రమే అభివృద్ధి చేయడం జరిగిందని కాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘నేను రైల్వే శాఖ మంత్రితో వివరంగా చర్చించాను. కనీసం 50 స్టేషన్లకు సంబంధించిన అంశానికి ప్రాధాన్యమిచ్చి చేపట్టవలసిన అవసరం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇటీవల ఆరు విమానాశ్రయాలను ఇదేవిధంగా ప్రైవేటీకరించడానికి ఉద్దేశించిన ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్వహించడానికి కార్యదర్శులతో కూడిన సాధికారిక కమిటీని ఏర్పాటు చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది’ అని కాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘రైల్వే మంత్రిత్వ శాఖ ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలోకి ప్రైవేట్ ట్రెయిన్ ఆపరేటర్లను తీసుకు రావాలని కూడా నిర్ణయించిన విషయం మీకు తెలిసిందే. తొలి దశలో 150 రైళ్లను ప్రైవేటీకరించడానికి యోచిస్తున్న విషయం తెలిసిందే’ అని కాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు.