బిజినెస్

జియో వడ్డింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వివిధ స్లాబుల్లో ఇతర నెట్ వర్క్‌లకు చేసే ఫోన్ కాల్స్‌కు ఇకపై రుసుం వసూలు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్ నిమిషానికి ఆరు పైసలు చొప్పున వసూలు చేయాలని తీర్మానించింది. ఈ నిర్ణయం గురువారం నుంచి అమలులోకి రానున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఈ అదనపు భారం నుంచి తప్పించడానికి ఐయుసీ టాప్‌అప్ ఓచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో అదనపు డేటాను పొందవచ్చు. జియో నుంచి జియోకు చేసే ఫోన్ కాల్స్‌కు మాత్రం ఎలాంటి చార్జీలు ఉండవు.