బిజినెస్

బీపీసీఎల్ ప్రైవేటీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. పలు సంస్థలను జాతీయకరణ చేస్తూ 1976లో చట్టం రూపొందింది. అందులో భాగంగానే బీపీసీఎల్ కూడా ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది. 2016లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేయడం ద్వారా పాక్షిక ప్రైవేటీకరణ సాధ్యమైంది. అయితే, బీపీసీఎల్‌ను పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేసి, ఆ తర్వాత సంస్థలో 53.3 శాతం వాటాను ప్రైవేటు సంస్థ లేదా సంస్థలకు విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల నుంచి 1.05 లక్షల కోట్ల రూపాయల విలువైన వాటాలను అమ్మేయాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే బీపీసీఎల్‌లో వాటాలు అమ్మకానికి ఉంచాలని తీర్మానించింది. మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వం అమ్మకానికి ఉంచిన షేర్ల విలువ 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.