బిజినెస్

మరోదఫా ఆర్బీఐ రెపోరేట్ల కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 6: రిజర్వు బ్యాంకు మరోదఫా రెపోరేట్ల కోతను చేపడుతుందా? ఔననే అంటున్నారు వాణిజ్య విశే్లషకులు. వచ్చే డిసెంబర్‌లో జరిగే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లలో మరో 0.25 శాతం తగ్గించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గత శుక్రవారం జరిగిన ఎంపీసీ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్లలో కోత విధించి బ్యాంకు రుణాలపై వడ్డీ శాతాన్ని 5.15కు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. గత త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టానికి చేరిన వృద్ధిరేటును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన చర్యలకు ఆర్బీఐ ఊతమిస్తోందన్న ప్రసంశలు వచ్చాయి. ఈక్రమంలో వడ్డీ రేట్లను 4.9 శాతానికి పరిమితం చేస్తూ మరోదఫా డిసెంబర్‌లో ఆర్బీఐ రెపోరేట్ల కోత విధిస్తుందన్న ఆశాభావాన్ని ఆదివారం నాడిక్కడ విడుదలైన ‘గోల్డ్‌మ్యాన్ సచ్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికన్ ఫెడరేషన్ సైతం వచ్చే డిసెంబర్‌లో రేట్లకోత మరోదఫా విధించే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక కార్యకలాపాలు హైఫ్రీక్వెన్సీతో సాగాలని భావిస్తున్న ఆర్బీఐ మరోదఫా రెపోరేట్ల కోతవైపే మొగ్గుచూపుతుందని ఆ నివేదిక తెలిపింది. మరోవైపుఈ దఫా రేట్లకోత సాహసోపేత నిర్ణయమే కానుంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం 4 శాతానికి మించరాదన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆహార, చమురు ధరల వృద్ధికారణంగా కొంత ఇబ్బందులు ఎదురైన దృష్ట్యా మరోదఫా కోత విధించిన తర్వాత ఆర్బీఐ ఈ రేట్లకోతకు స్వస్తి పలికే అవకాశం ఉందని తెలిపింది. ఇలావుండగా ఈ ఏడాది ఐదోదఫా ఆర్బీఈ చేపట్టిన రెపోరేట్ల కోతతో మొత్తం కొత విధించిన బేసిస్ పాయింట్లు 135కు చేరాయి. కాగా ఓ వైపు అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి మందగమనం నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన ముడిచమరు ధరలు మరింత ప్రతిబంధకంగా మారాయని, ఇందువల్ల ఫైనాన్షియల్ మార్కెట్లు నిలకడ లేమితో సతమతమవుతున్నాయని ఈక్రమంలో విదేశీ సెంట్రల్ బ్యాంకులు ఈ దుస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డాయని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ప్రతినిధి తెలిపారు. ప్రధానంగా పెట్టుబడిదారులు విధాన రేట్లపై దృష్టిపెడతారు కాబటి ఈరేటు 5 శాతం వరకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.